#VNRTrio మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభం

మరిన్ని వార్తలు

యంగ్ హీరో నితిన్, నేషనల్ క్రష్ రష్మిక మందన, టాలెంటెడ్ మేకర్ వెంకీ కుడుముల కాంబినేషన్‌లో #VNRTrio ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మాణంలో అత్యంత భారీ బడ్జెట్‌ తో రూపొందుతోంది.


ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర బృందం చెన్నైలో మ్యూజిక్ సిట్టింగ్‌ లను ప్రారంభించింది. ప్రముఖ లిరిక్ రైటర్ శ్యామ్ కాసర్ల కూడా #VNRTrio లో చేరారు. పనులు శరవేగంగా ప్రారంభమయ్యాయి. ఈ కాంబినేషన్ ప్రేక్షకులకు పండగలా వుండబోతుంది.


ఈ చిత్రంలో నితిన్ స్టైలిష్ అవతార్‌ లో కనిపిస్తుండగా, రష్మిక మందన అల్ట్రా-మోడరన్ లుక్‌ లో కనిపించనుంది. నితిన్, రష్మిక పుట్టినరోజుల సందర్భంగా మేకర్స్ విడుదల చేసిన పోస్టర్లకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.  


నవీన్ యెర్నేని, వై రవి శంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ తారాగణం, అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. నట కిరీటి రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ ఈ చిత్రంలో కీలక పాత్రలలో కనిపిస్తారు.


సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీని అందిస్తుండగా, ప్రవీణ్ పూడి ఎడిటర్ గా, రామ్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు త్వరలో తెలియజేస్తారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS