లాక్ డౌన్ లో కీల‌క నిర్ణ‌యం తీసుకున్న నిత్య‌మీన‌న్.

By Gowthami - June 20, 2020 - 11:30 AM IST

మరిన్ని వార్తలు

ప్ర‌తిభావంత‌మైన క‌థానాయిక‌ల్లో ఒక‌రిగా గుర్తింపు తెచ్చుకుంది నిత్య‌మీన‌న్‌. క‌థానాయిక‌లంతా గ్లామ‌ర్ పాత్ర‌ల‌వైపు మొగ్గు చూపిస్తుంటే, నిత్య మాత్రం న‌ట‌న‌కే ప్రాధాన్య‌మైన చిత్రాల్ని ఎంచుకుంది. విజ‌యాలు అందుకుంది. ఓ ద‌శ‌లో నిత్య ఉంటే చాలు, సినిమా హిట్ అనేంత పేరు సంపాదించుకుంది. ఇప్పుడు కాస్త లావుగా మారి, అవ‌కాశాలు త‌గ్గాయి గానీ, ఇప్ప‌టికీ నిత్య‌పై న‌మ్మ‌కాలు ఎవ‌రికీ త‌గ్గ‌లేదు. అయితే ఇప్పుడు నిత్య‌మీన‌న్ త‌న కెరీర్‌లో ఓ కీల‌క‌మైన నిర్ణ‌యం తీసుకుంద‌ని తెలుస్తోంది. న‌ట‌న‌ని ప‌క్క‌న పెట్టి, ద‌ర్శ‌క‌త్వం వైపు దృష్టి సారించ‌బోతోంద‌ని టాక్‌.

 

ఈ లాక్ డౌన్ స‌మ‌యంలో నిత్య కొన్ని క‌థ‌ల్ని సిద్ధం చేసుకుంద‌ట‌. వాటిని త‌న ద‌ర్శ‌క‌త్వంలోనే తెర‌కెక్కించాల‌ని డిసైడ్ అయ్యింద‌ట‌. అయితే ఈ సినిమాల్లో తాను క‌థానాయికగా న‌టించ‌ద‌ట‌. ఇంకొంత‌మందికి అవ‌కాశం ఇస్తుంద‌ట‌. నిత్య ద‌ర్శ‌క‌త్వం అంటే... నిర్మాత‌లెలాగూ సిద్ధంగా ఉంటారు. కాబ‌ట్టి... ఆ రూపంలో నిత్య‌కు ఎలాంటి స‌మ‌స్య‌లూ లేన‌ట్టే. త్వ‌ర‌లోనే నిత్య ద‌ర్శ‌కత్వంలో తెలుగు, త‌మిళ, మ‌ల‌యాళ భాష‌ల్లో ఓ సినిమా ప‌ట్టాలెక్కే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం. మ‌రి ఈ కొత్త పాత్ర‌లో నిత్య ఏ మేర‌కు రాణిస్తుందో చూడాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS