మలయాళీ ముద్దుగుమ్మ నిత్యామీనన్ మల్టీ టాలెంటెడ్ అన్న సంగతి తెలిసిందే. కథ, పాత్ర నచ్చితే చిన్న క్యారెక్టర్‌లోనైనా నటించేందుకు నిత్యా ముందుంటుంది. అందుకే ఆమె ఎంచుకున్న సినిమాల్లో కంటెన్ట్ పరంగా ప్రాధాన్యత ఉంటుందని చెప్పకనే చెప్పేయొచ్చు. వరుస సినిమాల్ని నిత్యా నుండి ఎక్స్‌పెక్ట్ చేయలేం కానీ, ఖచ్చితంగా మంచి సినిమాలు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు.
ఇకపోతే ప్రస్తుతం నిత్యామీనన్ మలయాళంలో రెండు సినిమాల్లో నటిస్తోంది. తమిళంలో జయలలిత బయోపిక్‌లో లీడ్ రోల్ పోషిస్తోంది. తెలుగులో 'ఎన్టీఆర్' బయోపిక్‌లో సావిత్రి పాత్ర పోషిస్తోంది. వీటన్నింటితో పాటు హిందీలోనూ తెరంగేట్రం చేసింది అందాల నిత్యామీనన్. హిందీలో అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కుతోన్న 'మిషన్ మంగళ్' సినిమాలో నిత్యామీనన్ హీరోయిన్‌గా నటిస్తోంది. భారతీయ ఇస్రో శాస్త్రవేత్తలు చంద్రమండలంలోకి పంపిన రాకెట్ కథతో తెరకెక్కుతోన్న చిత్రమిది. కథ నచ్చి ఈ సినిమాకి వెంటనే ఓకే చేసింది నిత్యామీనన్.
ఇక్కడ గమనించాల్సిందేమంటే, సీనియర్ నటి త్రిషను కూడా బాలీవుడ్‌కి పరిచయం చేసింది అక్షయ్‌కుమారే కావడం విశేషం. అయితే అప్పట్లో త్రిషకు వర్కవుట్ కాలేదు కానీ, నిత్యామీనన్ అలా కాదు, ఆమె ఎప్పుడూ స్పెషలే. ఆ స్పెషాలిటీతోనే భాషతో సంబంధం లేకుండా వరుస ఆఫర్స్‌తోనూ, సక్సెస్, ఫెయిల్యూర్స్‌తోనూ సంబంధం లేకుండా ఏ భాషలోనైనా నటిగా తనదైన శైలి గుర్తింపు తెచ్చుకుంటోంది. అదే ఆటిట్యూడ్‌తో బాలీవుడ్‌లో కూడా నిత్యామీనన్ దూసుకెళ్లాలని ఆశిద్దాం.