'ఆర్‌ఆర్‌ఆర్‌'లో నిత్యామీనన్‌ ఎందుకోసమంటే.?

మరిన్ని వార్తలు

మెగా మల్టీ స్టారర్‌గా రూపొందుతోన్న 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాకి సంబంధించి కాస్త లేట్‌ అయినా లేటెస్ట్‌గా అన్ని విషయాలనూ ప్రెస్‌ మీట్‌ పెట్టి మరీ రాజమౌళి క్లియర్‌ చేసేశారు.

 

అంతా బాగానే ఉంది. హీరోలు వారి పాత్రలు.. వారికి జోడీలు.. వారి పాత్రలూ.. ఇలా అన్నీ కుదిరాయి.. షూటింగ్‌ సాఫీగా జరుగుతోంది.. అనుకున్న తరుణంలో రామ్‌చరణ్‌ కాలికి గాయం కావడం, షూటింగ్‌ మూడు వారాలు వాయిదా పడడం, తర్వాత హీరోయిన్‌గా నటిస్తున్న విదేశీ భామ డైసీ ఎడ్గర్‌ జోన్స్‌ ప్రాజెక్ట్‌ నుండి తప్పుకోవడం మళ్లీ 'ఆర్‌ఆర్‌ఆర్‌'ని సందిగ్ధంలో పడేసింది. రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ కాంబినేషన్‌లో రూపొందుతోన్న ఈ సినిమాకి రామ్‌చరణ్‌ జోడీగా అలియాభట్‌ ఉంది. కానీ డైసీ హ్యాండివ్వడంతో ఎన్టీఆర్‌ జోడీ ప్రశ్నార్ధకమైంది. ఈ క్రమంలో నిత్యామీనన్‌ని ఈ సినిమా కోసం రాజమౌళి ఎంచుకున్నారనే న్యూస్‌ తెరపైకి వచ్చింది. దాంతో ఎన్టీఆర్‌కి జోడీగా నిత్యామీననా.? అంటూ మరికొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే అదేం కాదనీ, నిత్యామీనన్‌ మంచి నటి. ఎలాంటి పాత్రనైనా టేకప్‌ చేయగల సత్తా ఉన్న నటి. సో ఈ సినిమాలోని ఓ ఇంపార్టెంట్‌ రోల్‌ కోసం నిత్యాని రాజమౌళి ప్రిఫర్‌ చేసినట్లు తెలుస్తోంది. మెగా కాంపౌండ్‌నే తీసుకుంటే, గతంలో 'సన్నాప్‌ సత్యమూర్తి' సినిమాలో బన్నీ సరసన సెకండ్‌ హీరోయిన్‌గా నటించింది నిత్యా మీనన్‌.

 

నటిగా మంచి గుర్తింపు ఉన్నా, అది తప్ప స్టార్‌హీరోలతో నిత్యామీనన్‌ స్క్రీన్‌ షేర్‌ చేసుకున్న దాఖలాలు లేవు. రాజమౌళి, నిత్యామీనన్‌ని ఎంచుకున్నాడంటే ఆ పాత్ర సినిమాకి ఎంత కీలకమో అర్ధం చేసుకోవాలి. అయితే ఆ పాత్ర ఎన్టీఆర్‌కి జోడీనా.? లేక ఓన్లీ ఇంపార్టెంట్‌ రోలేనా.? అనేది తెలియాల్సి ఉంది. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS