నిత్యా మీనన్ తను చేసే చిత్రాల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. దీనికి సంబంధించి ఆమె కెరీర్ గ్రాఫ్ ఒకసారి చూస్తే మనకే తెలిసిపోతుంది. అయితే ఈ మధ్యకాలంలో కొన్ని ఫాన్సీ ఆఫర్స్ ని ఆమె వదులుకోవడం చర్చనీయాశం అయింది.
ఇంతకి ఆ చిత్రాలు ఏంటి అనగా- ఒకటేమో మహానటి సావిత్రి జీవితాన్ని ఆధారం చేసుకుని తీస్తున్న మహానటి చిత్రం కాగా మరొకటి మహానటుడు ఎన్టీఆర్ జీవితం పైన వస్తున్న ఎన్టీఆర్ చిత్రం. ఈ రెండు చిత్రాలలో నటించే అవకాశం వస్తే దాదాపుగా ఎవరు వదులుకోరు అలాంటిది నిత్యా మాత్రం ఆ ఆఫర్స్ ని కాదనుకుంది.
కారణం ఏంటి అంటే- తనకి కథ పూర్తిగా నచ్చితేనే ఏ సినిమా అయినా చేస్తాను. తనకి ఏ మాత్రం సంశయం అనిపించినా తాను ఆ చిత్రం ఒప్పుకోను అని తెలిపింది. అయితే ఈ రెండు చిత్రాలు వదులుకోవడానికి కారణం ఇదేనా అని అడగగా- లేదు. అయితే ఆ కారణాలు ఇప్పుడు చెబితే మీడియా వారు ఒకదానికి మరొకటి రాస్తారు. అందుకే నేనెందుకు చేయలేదు అన్నది బయటపెట్టను అని తేల్చిచెప్పింది.
మొత్తానికి నిత్యా మీనన్ సినీ పరిశ్రమని అందులో ఉండేవారిని బాగానే అవగాహనలోనికి తెచ్చుకున్నట్టుగా కనిపిస్తున్నది.