Nithya Menon: అవ‌న్నీ ఒట్టిదే అంటున్న నిత్య‌మీన‌న్‌

మరిన్ని వార్తలు

నిత్య‌మీన‌న్ పేరు.. ఈమ‌ధ్య వార్త‌ల్లో తెగ వినిపిస్తోంది. ముఖ్యంగా నిత్య‌మీన‌న్ పెళ్లి చేసుకోబోతోంద‌న్న ఓ వార్త గ‌ట్టిగా షికారు చేస్తోంది. ఓ మ‌ల‌యాళ హీరోతో నిత్య స‌న్నిహితంగా ఉంటోంద‌ని, త్వ‌ర‌లో వాళ్లిద్ద‌రూ పెళ్లి చేసుకోబోతున్నార‌ని సౌత్ ఇండియా అంతా కోడై కూస్తోంది. దాంతో ఆ హీరో ఎవ‌రా? నిత్య పెళ్లి ఎప్పుడా అంటూ అంద‌రూ ఆస‌క్తిగా చూడ‌డం మొద‌లెట్టారు.

 

ఇప్పుడు ఈ వార్త‌ల‌పై నిత్య‌మీన‌న్ క్లారిటీ ఇచ్చింది. త‌న పెళ్లిపై వ‌స్తున్న వార్త‌ల‌న్నీ ఒట్టి పుకార్లే అని, అందులో నిజం లేద‌ని తేల్చేసింది. ఇలాంటి వార్త‌లు రాసేట‌ప్పుడు కాస్త ఆలోచించుకోవాల‌ని హిత‌వు ప‌లికింది.

 

``ఏ విష‌య‌మైనా నిజ‌మ‌ని తెలిసిన త‌ర‌వాతే.. దాన్ని ప్ర‌చురించండి. అన‌వ‌స‌ర‌మైన గాలి వార్త‌ల‌కు ప్రాధాన్యం ఇవ్వొద్దు`` అంటూ మీడియాకు చుర‌క అంటించింది. దాంతో.. నిత్య‌మీన‌న్ పెళ్లి వార్త‌ల‌న్నీ ఒట్టిదే అని తేలిపోయింది. ఇటీవ‌లే `భీమ్లా నాయ‌క్‌`తో టాలీవుడ్ ని మ‌ళ్లీ ప‌ల‌క‌రించింది నిత్య‌. ఆహాలో ఓ రియాలిటీ షోలో నిత్య జ‌డ్జ్ గా వ్య‌వ‌హ‌రించిన సంగ‌తి కూడా తెలిసిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS