అచ్చు 'అమ్మ'లా నిత్యా స్కెచ్‌.!

మరిన్ని వార్తలు

మల్టీ టాలెంటెడ్‌ నిత్యా మీనన్‌ ప్రస్తుతం జయలలిత బయోపిక్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. 'ది ఐరన్‌ లేడీ' అనే టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాకి నిత్యామీనన్‌ని మించిన నటి ఉంటుందా.? అంటే ఉన్నారులెండి. ఒకే టైంలో జయలలిత బయోపిక్స్‌ మూడు తెరకెక్కుతున్నాయి. నిత్యా కాకుండా, మరో ఇద్దరు నటీ మణులు ఈ బయోపిక్‌లో నటిస్తున్నారు వారే బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌ ఓ వైపు. రమ్యకృష్ణ ఇంకో వైపు. ఒకే బయోపిక్‌ని ముగ్గురు హీరోయిన్స్‌తో ఒకేసారి తెరకెక్కిస్తుండడం నిజంగా విశేషం.

 

నిత్యామీనన్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న బయోపిక్‌కి తెర వెనక రంగం ఎప్పుడో సిద్ధమైంది. ఇక కంగనా ప్రధాన పాత్రలో 'తలైవి' అనే టైటిల్‌తో రూపొందుతోన్న బయోపిక్‌ ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉంది. ఈ మధ్యనే కంగనాపై ప్రోస్థటిక్‌ టెస్ట్‌లు జరిగాయి. ఇక రమ్యకృష్ణ సినిమాకి సంబంధించి పెద్దగా డీటెయిల్స్‌ లేవు. కానీ, ఇటీవల ఓ ఫస్ట్‌లుక్‌ విడుదల చేశారు. ఇక నిత్యమీనన్‌ బయోపిక్‌ విషయానికొస్తే, ఆల్రెడీ ఓ ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌ చేశారు. తాజాగా స్కెచ్‌ చేసినట్లుగా మరో లుక్‌ నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది.

 

జయలలిత బయోపిక్‌ అంటే ముఖ్యంగా రెండు వేరియేషన్స్‌ చూపించాల్సి ఉంటుంది. ఆమె హీరోయిన్‌గా ఉన్నప్పుడూ, రాజకీయాల్లోకి వచ్చినప్పుడు.. సినిమాల్లో ఉన్నప్పుడు చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసేమో కానీ, రాజకీయాల్లోకి వచ్చాక జయలలిత ఎలా ఉందో అందరికీ తెలిసిందే. అమ్మ అని తమిళ ప్రజలు ఆమెను అభిమానంగా పిలచుకునేవారు. ఆ 'అమ్మ' పాత్రలోనే ప్రస్తుత లుక్‌లో నిత్యామీనన్‌ కనిపిస్తోంది. ఇది ఒరిజినల్‌ లుక్‌నా.? లేక ఊహా చిత్రమా.? అనేది తెలియాల్సి ఉంది. కానీ, ఈ లుక్‌లో నిత్యామీనన్‌ ఎగ్జాట్‌ అమ్మని తలపిస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS