మ‌న్మ‌థుడు 2 చూసి భ‌య‌ప‌డిన వెంకీ?

మరిన్ని వార్తలు

నాగార్జున మ‌న్మ‌థుడు 2 డిజాస్ట‌ర్‌గా మిగిలింది. ఈ సినిమా ఇప్పుడు వెంక‌టేష్ సినిమాపై కూడా ఎఫెక్ట్ చూపిస్తోంది. వెంకీ ఇది వ‌ర‌కే ఒప్పుకున్న ఓ క‌థ‌ని ఇప్పుడు `మ‌న్మ‌థుడు 2` రిజ‌ల్ట్ చూసి ప‌క్క‌న పెట్టిన‌ట్టు టాక్‌. వివ‌రాల్లోకి వెళ్తే.. బాలీవుడ్‌లో ఘ‌న విజ‌యం సాధించిన చిత్రం `దే దే ప్యార్ దే`. అజ‌య్ దేవ‌గ‌ణ్ క‌థానాయ‌కుడిగా న‌టించాడు. ఇది 50 ఏళ్ల‌లో ప్రేమ‌లో ప‌డిన వ్య‌క్తి క‌థ‌. ముదురు ల‌వ్ స్టోరీ అన్న‌మాట‌. ఇలాంటిక‌థ‌ల‌కు వెంకీ స‌రిగ్గా స‌రిపోతాడు. అందుకే ఆ సినిమా రీమేక్ రైట్స్ ని ఫ్యాన్సీ రేటుకి చేజిక్కించుకున్నాడు సురేష్ బాబు.

 

వెంకీ కూడా ఈ సినిమా చేయ‌డానికి రెడీ అయ్యాడు. అయితే మ‌న్మ‌థుడు 2 స్టోరీ లైన్ కూడా ఇంచుమించుకుగా ఇలానే ఉంటుంది. అలాంటి పాత్ర‌ల్లో హీరోల్ని చూడ్డానికి అభిమానులు ఇష్టంగా లేర‌న్న విష‌యాన్ని `మ‌న్మ‌థుడు 2` రిజ‌ల్ట్ నిరూపించింది. అందుకే వెంక‌టేష్ కూడా ఈ ప్రాజెక్టుని ప‌క్క‌న పెట్టార‌ని స‌మాచారం. ఇదే క‌థ‌పై ద‌ర్శ‌కుడు శ్రీ‌వాస్ రెండు మూడు నెల‌ల నుంచి వ‌ర్క్ చేస్తున్నారు. ఇప్పుడు మ‌రో హీరోని వెదుక్కోవాల్సివ‌స్తోంది. వెంకీ కాక‌పోతే.. ఎవ్వ‌రూ ఈ క‌థ‌కు న్యాయం చేయ‌లేరు. మ‌రి... సురేష్ బాబు ఏం చేస్తాడో చూడాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS