నాని, నివేదా 'నిన్ను కోరి'

మరిన్ని వార్తలు

నాని మళ్లీ మెరుపుల మొదలెట్టేశాడు. నిన్న కాక మొన్నే 'నేను లోకల్‌' సినిమాతో పిచ్చ పిచ్చగా అలరించాడు. ఇంకా అలరిస్తూనే ఉన్నాడు. ఈ లోగానే తన కొత్త సినిమా ఫస్ట్‌లుక్‌ని విడుదల చేసేశాడు. శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాతోనే శివ డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాలో నాని పక్కన నివేదా థామస్‌ హీరోయిన్‌గా నటస్తోంది. 'జెంటిల్‌మెన్‌' సినిమాలో ఈ జంట కనువిందు చేసింది. మళ్లీ రెండోస్సారి నానితో జతకడుతోంది ఈ ముద్దుగుమ్మ ఈ సినిమాలో. యంగ్‌హీరో ఆది పినిశెట్టి ఈ సినిమాలో మరో హీరోగా నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ బయటికి వచ్చింది. 'నిన్ను కోరి' అనే టైటిల్‌ని ఈ సినిమాకి ఫిక్స్‌ చేశారు. ఈ సినిమా షూటింగ్‌ అంతా అమెరికాలో జరగడం విశేషం. అందుకు తగ్గట్టుగానే ఈ ఫస్ట్‌లుక్‌ కూడా ఉంది. బంగారు తళుకుల మధ్య నాని నవ్వుతూ కూర్చున్నాడు. లెట్స్‌ వెల్‌కమ్‌ లైఫ్‌ అంటున్నాడు. నేను లోకల్‌తోనే నవ్వులు పండించిన నాని, ఈ సినిమాతో ఇంకా ఏదో కొత్తదనం చూపిస్తానంటున్నాడు. నిజమే నమ్మొచ్చు నానిని. ఎందుకంటే తన ప్రతీ చిత్రానికి ఏదో ఒక కొత్తదనం చూపించడమే నాని ప్రత్యేకత. అసలే కొత్త డైరెక్టర్‌, ఆ పై నాని టాలెంట్‌, మరో టాలెంటెడ్‌ హీరో ఆది ఓహో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. చూద్దాం ఈ సినిమాతో నాని ఇంకేం మేజిక్‌ చేస్తాడో! 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS