బిగ్‌హౌస్‌లో డే వన్ నుండీ పునర్నవి, వితిక, వరుణ్, రాహుల్.. ఈ నలుగురూ ఓ గ్రూప్‌గా ఉంటున్నారు. వీరి మధ్య మంచి స్నేహం ఉంది. ఓ రకమైన బాండింగ్ ఉంది. కానీ, ఎందుకో తాజా ఎపిసోడ్స్‌ని బట్టి వీరి మధ్య స్నేహం చెడిందనే అభిప్రాయానికి వచ్చేశారు నెటిజన్లు. రాహుల్‌ని నామినేట్ చేయడంతో పునర్నవిపై నెగిటివ్ అభిప్రాయం వచ్చేసింది. సీరియస్‌నెస్ లేదనే సిల్లీ రీజన్ చెప్పడం అస్సలు బాగోలేదు. ఇంతవరకూ వీరిద్దరి మధ్యా స్నేహానికి మించిన బాండింగ్ ఏదో ఉందని అభిప్రాయ పడ్డారు.
కానీ, రాహుల్‌ని సీరియస్‌గా నామినేట్ చేసి, పునర్నవి ఆ అభిప్రాయాన్ని గంగలో కలిపేసింది. ఇదిలా ఉంటే, తాజాగా వితిక - పునర్నవి మధ్య కూడా ఏదో జరిగింది. ఆషూరెడ్డితో వితిక, పునర్నవి గురించి మాట్లాడడం, ఇద్దరూ కూర్చొని, ఇష్యూ సెటిల్ చేసేసుకోండి. మాట్లాడుకోకుండా, ఇంకెన్ని రోజులు హౌస్‌లో ఉంటారు.? అని ఆషూ వితికాకి సూచించడం, ఎంత ట్రై చేసినా పున్ను నాతో మాట్లాడేందుకు ఛాన్స్ ఇవ్వడం లేదు.. అని వితిక చెప్పడం.. ఇదంతా చూస్తుంటే పునర్నవికీ, వితికాకి చెడిందని మాత్రం అర్ధమవుతోంది.
కానీ, ఏ విషయంలో అనేదానిపై క్లారిటీ లేదు. ఇక పునర్నవి కూడా ఒంటరిగా కూర్చొని, ఏం మనుషులో, ఏ క్షణానికి ఏ రకంగా మారుతున్నారో, ఎవరిని ఎలా ఎప్పుడు నమ్మాలో అర్ధం కావడం లేదు.. అంటూ తనలో తాను మాట్లాడుకోవడం కూడా ఈ అనుమానాలకు బలమిస్తోంది. ఈ బిగ్ ఫ్రెండ్స్ మధ్య అసలు ఏం జరిగింది? ఏ సిట్యువేషన్‌లో వీరు మళ్లీ కలుస్తారనేది వేచి చూడాలిక.