మలయాళ ముద్దుగుమ్మ నివేదా థామస్ మొదట్లో గ్లామర్‌కి తాను దూరం అంది. కానీ హీరోయిన్ అన్నాక గ్లామర్ తప్పనిసరి అంటోందిప్పుడు. అయితే హద్దులు మీరిన గ్లామర్‌ని తన ద్వారా ఆశించొద్దనీ చెబుతోందీ నేచురల్ బ్యూటీ. పాత్రకి అవసరం ఉన్నంతవరకూ, సిట్యువేషన్ డిమాండ్ చేసినంత వరకూ తాను గ్లామర్‌గా కనిపిస్తానంటోంది. ఏది ఏమైనా ఈ ముద్దుగుమ్మ గ్లామర్ ప్రదర్శించినా, ప్రదర్శించుకున్నా, కానీ అందమే. అందుకే నేచురల్ బ్యూటీనెస్ అమ్మడి సొంతం. 'జై లవకుశ' సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ఆడియో ఫంక్షన్లో రాయల్ బ్లూ డ్రస్సులో ఇలా బ్యూటీక్వీన్లా తళుక్కున మెరిసింది.