పరీక్ష పాసైన నివేదా థామస్‌

మరిన్ని వార్తలు

ఇదిగో ఈ ఫోటో చూశారా? ఏదో ఎగ్జామ్‌కి ప్రిపేర్‌ అవుతున్నట్లుగా కనిపిస్తోన్న ఈ ముద్దుగుమ్మ ఎవరనుకుంటున్నారా?. నివేదా థామస్‌. ఇదేదో ఎగ్జామ్‌ ప్రిపరేషన్‌ అనుకుంటే తప్పులో కాలేసినట్టేనండోయ్‌. ఈ ముద్దుగుమ్మ సినిమాలోని ఓ సీన్‌కి సంబంధించిన డైలాగ్‌ని ఇలా చదువుకుంటోంది. స్టార్ట్‌, కెమెరా అనగానే కెమెరా ముందుకెళ్లిపోతే అంత కిక్కుండదు. సీను అంతగా పండదు. అందుకే షూటింగ్‌ గ్యాప్‌లో ఇలా తన డైలాగ్స్‌ని చదివి, అందుకు తగ్గట్లుగా తన హావభావాల్ని ప్రాక్టీస్‌ చేస్తుందట. చూశారా నివేదా థామస్‌ కమిట్‌మెంట్‌. ఏ పనిలోనైనా ఓ కమిట్‌మెంట్‌ ఉంటే సక్సెస్‌ దానంతట అదే వస్తుందంటుంటారు. కమిట్‌మెంట్‌ని పక్కాగా ఫాలో అవుతుంది ముద్దుగుమ్మ నివేదా థామస్‌. అందుకే అమ్మడికి సక్సెస్‌ మీద సక్సెస్‌లు వస్తున్నాయి. వరుస ఆఫర్స్‌తో దూసుకెళ్లిపోతోంది. ఏదో గ్లామర్‌తో సక్సెస్‌ కొట్టేయడం కాదు. యాక్టింగ్‌ టాలెంట్‌తో సక్సెస్‌ అందుకుంటోంది. ప్రతీ సినిమాకి యాక్టింగ్‌లో నూరుకు నూరు మార్కులు వేయించుకుంటోంది. విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంటోంది. తాజాగా 'నిన్ను కోరి' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ ముద్దుగుమ్మ సూపర్‌ హిట్‌ని తన ఖాతాలో పడేసుకుంది. తొలి సినిమా 'జెంటిల్‌మెన్‌' నుండీ అమ్మడు హిట్స్‌ మీద హిట్స్‌ కొడుతూనే ఉంది. త్వరలోనే 'జై లవకుశ' సినిమాతో మన ముందుకు రానుంది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ఎన్టీఆర్‌తో రొమాన్స్‌ చేయనుంది ఈ ముద్దుగుమ్మ. అంతేకాదు, హీరో నాని తర్వాతి సినిమాలోనూ ఈ ముద్దుగుమ్మ హీరోయిన్‌గా ఎంపికైందని గాసిప్స్‌ వస్తున్నాయి. ఒకవేళ అదే జరిగితే నానితో హ్యాట్రిక్‌ కొట్టడానికి నివేదా రెడీ అని చెప్పక తప్పదు. 

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS