'జై లవకుశ' తర్వాత ఎక్కడా కనిపించలేదు ముద్దుగుమ్మ నివేదా థామస్. ఆ సినిమా హిట్ అయినా కానీ ఈ బ్యూటీ కనిపించకపోవడంతో, టాలీవుడ్‌ని వదిలేసిందని అంటున్నారంతా. అయితే సినిమాలు వదిలేసి, స్టడీస్ మీద దృష్టి పెట్టిందని గాసిప్స్ షికార్లు చేస్తున్నాయి. ఈ గాసిప్స్‌పై స్పందించింది ముద్దుగుమ్మ నివేదా థామస్. ఆల్రెడీ ఓ తెలుగు సినిమాలో నటిస్తున్నాను. ఇంకో రెండు సినిమాలు డిస్కర్షన్స్‌లో ఉన్నాయి అంటోంది.
మలయాళీ సినీ పరిశ్రమ నుండి వచ్చినా, తెలుగు సినిమాలకే ఎక్కువ టైం కేటాయిస్తానంటోంది. ఎందుకంటే తెలుగు సినిమానే తనని స్టార్‌ని చేసిందని చెబుతోంది. అయితే ఈ గ్యాప్ ఎందుకంటే.. కథల ఎంపికలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటోందట. అందుకే వచ్చిన ప్రతీ అవకాశాన్నీ అందిపుచ్చుకోలేకపోతున్నానంటోంది. చిన్న గ్యాప్ వచ్చినా అది తర్వాత చేయబోయే మంచి సినిమా కోసమే తప్ప ఇంకోటి కాదనీ చెబుతోంది నివేదా థామస్. అలాగే చదువునీ, కెరీర్‌ని ప్లాన్ చేసుకోగల సత్తా తనకుందంటోంది.
2017లో 'నిన్ను కోరి', 'జై లవకుశ' సినిమాల్లో నటించింది. ఈ రెండు సినిమాలతో రెండు హిట్లు తన ఖాతాలో వేసుకుంది. వీటితో పాటు 'అందాల రాక్షసి' ఫేం నవీన్ చంద్రతో 'జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్' సినిమాలో నటించింది. కానీ ఆ సినిమా ఆశించిన విజయాన్నివ్వలేదు నివేదాకి. అందం, యాక్టింగ్ టాలెంట్ అన్నీ ఉన్న ఈ ముద్దుగుమ్మ ఈ ఏడాది కూడా వరుస సినిమాలతో వస్తానంటోంది. కథ బాగుంటే, చిన్న హీరో, పెద్ద హీరో అనే తేడా లేకుండా సినిమాలు చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానంటోంది ముద్దుగుమ్మ నివేదా థామస్.