సాహోపై ఇంకా క్లారిటీ రాలేద‌ట‌!

మరిన్ని వార్తలు

సాహో పోస్ట్ పోన్ అయ్యింద‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిపోయింది. కానీ.. చిత్ర‌బృందం మాత్రం ఈ విష‌యంలో ఇప్ప‌టి వ‌ర‌కూ ఎలాంటి ప్ర‌క‌ట‌నా చేయ‌లేదు. వ‌స్తున్నాం - రావ‌డం లేదు - అనే క్లారిటీ కూడా ఇవ్వ‌డం లేదు. నిజానికి `సాహో` విడుద‌ల తేదీ వాయిదా వేయ‌డం కూడా నిర్మాత‌ల చేతుల్లో లేదు. ఎందుకంటే... తెలుగుతో పాటు హిందీలోనూ ఈ సినిమాని విడుద‌ల చేస్తున్నారు. ఆగ‌స్టు 15న విడుద‌ల తేదీ ఫిక్స‌యిపోయింది. దానికి త‌గ్గ‌ట్టే థియేట‌ర్ల స‌ర్దుబాటు జ‌రిగిపోయింది. ఇప్పుడు ఈ డేట్ ని మారిస్తే... హిందీ విడుద‌ల‌పై ప్ర‌భావం ప‌డే అవ‌కాశం ఉంది. అక్క‌డ మ‌ళ్లీ సాహోకి స‌రిప‌డ థియేట‌ర్లు దొర‌క‌డం క‌ష్టం.

 

రిలీజ్ డేట్ మారిస్తే.... మార్చిన డేట్‌కి హిందీ సినిమాలేమైనా వ‌స్తున్నాయో రావ‌డం లేదో చూసుకోవాలి. నైజాం, ఓవ‌ర్సీస్ పంపిణీదారులకు సాహో రిలీజ్ డేట్ మార్చ‌డం ఏమాత్రం ఇష్టం లేదు. రిలీజ్ డేట్ మారిస్తే సినిమాపై నెగిటీవ్ ఇంపాక్ట్ ప‌డుతుంద‌ని వాళ్ల భ‌యం. వీలైనంత వ‌ర‌కూ ఆగ‌స్టు 15నే విడుద‌ల అయ్యేలా చూడాల‌ని నిర్మాత‌ల‌పై ఒత్తిడి తీసుకొస్తున్నారు. అస‌లు ఇప్ప‌టి వ‌ర‌కూ ఎంత వ‌ర్క్ జ‌రిగింది? అనుకున్న స‌మ‌యానికి సినిమా పూర్త‌వుతుందా లేదా? అనే విష‌యంలో చిత్ర‌బృందం ఇంకా ఓ క్లారిటీకి రాలేక‌పోతోంది.

 

పోస్ట్ ప్రొడ‌క్ష‌న్‌ని మ‌రింత స్పీడప్ చేసుకుంటూ వెళ్తే, వీఎఫ్ఎక్స్ కోసం మ‌రిన్ని కంపెనీల చేతిలో పెడితే, ఈ జాప్యం కొంత వ‌ర‌కూ త‌గ్గించొచ్చు. ఇప్పుడు రిలీజ్ డేట్ మార్చామ‌ని చెప్పి, ఆ త‌ర‌వాత 'కాదు.. కాదు 15నే వ‌స్తున్నాం' అంటే మ‌రింత గంద‌ర‌గోళం నెల‌కుంటుంది. రిలీజ్ డేట్ మారుస్తున్నాం అంటే స‌రిపోదు.. కొత్త రిలీజ్ డేట్ కూడా ప‌క్కాగా ఫిక్స్ చేసుకోవాలి. దాన్ని అధికారికంగా ప్ర‌క‌టించాలి. ఇప్పుడు కొత్త రిలీజ్ డేట్ ప్ర‌క‌టించాక‌, దాన్ని మారిస్తే - ఇంకాస్త ఎక్కువ డామేజ్ జ‌రుగుతుంది. అందుకే అన్ని విధాలా ఆలోచించి, నిర్ణ‌యం తీసుకుని, అప్పుడు రిలీజ్ డేట్‌పై పెద‌వి విప్పాల‌ని సాహో టీమ్ భావిస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS