ర్యాపర్ నోయెల్ అంటే ఎనర్జీకి కేరాఫ్ అడ్రస్. పలు సినిమాల ప్రమోషన్లలో, బుల్లితెరపై పలు షోలలో నోయెల్ ఆడియన్స్‌ని మేగ్జిమం ఎంటర్‌టైన్ చేశాడు. కానీ, బిగ్‌బాస్ రియాల్టీ షోకి వచ్చేసరికి ఆ ఎనర్జీ ఎక్కడా కనిపించడంలేదు. అసలేమైంది నోయెల్‌కి? ఇదే ఇప్పుడెవరికీ అర్థం కావడంలేదు. ‘రాముడు మంచి బాలుడు’ తరహాలో డల్‌గా వుండిపోతున్నాడన్న విమర్శలు నోయెల్‌పై గట్టిగానే వినిపిస్తున్నాయి. దానికి తోడు ఫిట్‌నెస్ సమస్యలు ఎదుర్కొంటున్నాడు.
‘చాలా సీరియస్ అవుతోంది బ్రదర్.. ఇది లైఫ్ టైం ఇబ్బందికరమైన సమస్యగా మారకూడదు..’ అంటూ సాటి కంటెస్టెంట్ అబిజీత్ చెప్పాల్సి వస్తోంది నోయెల్‌కి. మరోపక్క, నోయెల్ బాగానే వున్నాడంటూ అతని పీఆర్ టీం సోషల్ మీడియా వేదికగా ప్రకటనలు గుప్పించేస్తోంది. కానీ, హౌస్‌లో నోయెల్ తీరు చూస్తే మాత్రం, పరిస్థితి ప్రమాదకరంగా వుందనే అనుమానాలకు తావిస్తోంది. ఏది నిజం.? ఇదే అర్థం కావడంలేదు బిగ్‌బాస్ వ్యూయర్స్‌కి. నోయెల్ కావాలనే ఎమోషనల్ గేం ఆడుతున్నాడా.? అన్న అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఒకవేళ ఆ ఎమోషనల్ గేం నిజమే అయితే మాత్రం, అది అతనికి చాలా పెద్ద మైనస్ కాబోతోందని నిస్సందేహంగా చెప్పొచ్చు. నోయెల్‌కి వున్న రియల్ టాలెంట్‌లో కనీసం పదో వంతు కూడా ఈ షో ద్వారా అతను అభిమానుల్ని ఎంటర్‌టైన్ చేయలేకపోతున్నాడు.