'టెంపర్‌' గ్లామర్‌ వైజాగ్‌ సన్నీలియోన్‌

By iQlikMovies - November 19, 2018 - 16:14 PM IST

మరిన్ని వార్తలు

'టెంపర్‌' సినిమాతో కుర్రకారుకు టెంపరేచర్‌ పెంచేసిన బ్యూటీ నోరా ఫతేహి. వైజాగ్‌ సన్నీలియోన్‌ అంటూ 'టెంపర్‌'లో ఐటెం సాంగ్‌లో కిర్రాకు స్టెప్పులేసేసింది ఈ మొరాకో బ్యూటీ. ఈ సాంగ్‌లో అమ్మడి స్టెప్పులకు సన్నీలియోనే కుళ్లుకుని ఉంటుంది. ఈ సినిమా ఇచ్చిన కిక్కుతో ఈ హాట్‌ బ్యూటీకి ఐటెం గాళ్‌గా వరుస అవకాశాలు వచ్చేశాయి. 

'బాహుబలి', 'కిక్‌ 2', 'ఊపిరి', 'షేర్‌' ఇలా పలు చిత్రాల్లో నటించేసింది. ఈ మధ్య బాలీవుడ్‌నీ అమ్మడు ఓ ఊపు ఊపేసింది. ఏ సాంగ్‌ అంటారా? అదే 'దిల్‌ బర్‌ దిల్‌ బర్‌..' అంటూ నడుం తిప్పేసింది కదా. ఆ క్రెడిట్‌ కూడా ఈ ముద్దుగుమ్మ ఖాతాలోదే. ఇలా ఐటెం సాంగ్స్‌కి ఓ రేంజ్‌ గ్లామర్‌ తీసుకొచ్చేసింది నోరా ఫతేహి. అదృష్టం కలిసి రాలేదు. కానీ ఈ బ్యూటీ అందానికి హీరోయిన్‌ అవ్వగల సత్తా ఉన్నా, ఐటెం సాంగ్స్‌తోనే సరిపెట్టేసుకుంటోంది. ఐటెం సాంగ్స్‌నీ తక్కువంచనా వేయడానికి లేదు కదా. 

ఇటు టాలీవుడ్‌నీ, అటు బాలీవుడ్‌నీ కూడా తన వయ్యారాల స్టెప్పులతో ఉర్రూతలూగించేస్తోందీ 'నెమలి' ('ఊపిరి' ఐటెం సాంగ్‌లో నోరా క్యారెక్టర్‌).


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS