విజయ్ దేవరకొండ సినిమా అనగానే, అందులో బూతులు వుండాల్సిందేనా? ఈ భావన 'అర్జున్‌రెడ్డి' సినిమాతో కలిగిన మాట వాస్తవమే అయినప్పటికీ, అన్ని సినిమాలూ ఒకేలా వుండవు. ఇంకా 'అర్జున్‌రెడ్డి' సినిమా గురించి మాట్లాడుతూ, విజయ్ దేవరకొండ ఇమేజ్‌ని తగ్గించాలనో, అతని ఇమేజ్‌ని బ్యాడ్ చేయాలనో చూడటం ఎంతవరకు సబబు? విజయ్ నుంచి 'మహానటి' సినిమా వచ్చింది. విజయ్ నుంచి 'గీత గోవిందం' సినిమా వచ్చింది.
విజయ్ దేవరకొండ కథల ఎంపికలో తనదైన ప్రత్యేకతను చాటుకుంటూనే వస్తున్నాడు. తన కొత్త సినిమా 'నోటా' విషయంలో విజయ్ చాలా కాన్ఫిడెంట్‌గా వున్నాడు కూడా. ఈ సినిమాకి క్లీన్ యూ సర్టిఫికెట్ తమిళంలో లభించింది. తెలుగులోనూ అదే సర్టిఫికెట్ లభిస్తుందనే ధీమాతో వుంది చిత్ర యూనిట్. అయితే, సెన్సార్ బోర్డ్ సభ్యులు సినిమాలోని కొన్ని డైలాగులపై అభ్యంతరాలు తెలియజేశారనీ, సినిమాలో బూతులు కూడా వున్నాయనే ఓ టాక్ స్ప్రెడ్ అయ్యింది.
ఇందులో వాస్తవం ఎంత? అనేది తెలియవలసి వుంది. పొలిటికల్ నేపథ్యం వున్న సినిమా కావడంతో కొన్ని అభ్యంతరాలు సెన్సార్ నుంచి వస్తే రావొచ్చుగాక. కానీ, బూతులు వున్నాయనడం సరికాదని 'నోటా' టీమ్ నుంచి ఓ అప్పీల్ ఆఫ్ ది రికార్డ్‌గా బయటకు వస్తోంది. సినిమా ఈ నెల 5న విడుదలకు సిద్ధమవుతున్న సంగతి తెల్సిందే.
ఈ సమయంలో 'నోటా'పై నెగెటివ్ ప్రచారం ఆ సినిమా యూనిట్‌ని కొంత ఆందోళనకు గురిచేస్తోంది. అయితే సినిమాపై అంచనాలు మాత్రం ఆకాశాన్నంటేలా వుండడం సినిమా యూనిట్‌కి కొత్త ఉత్సాహాన్నిస్తోందని నిస్సందేహంగా చెప్పొచ్చు.