'నోటా'కి ఓటేశారు రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ చేశారు.!

మరిన్ని వార్తలు

విజయ్‌ దేవరకొండ తెలివితేటలు అన్నీ ఇన్నీ కావు. ఈ మధ్య చూస్తూనే ఉన్నాం. ఎంతో తెలివిగా సినిమాలు చేయడమే కాదు, అంతకన్నా తెలివిగా ప్రమోషన్స్‌ కూడా చేస్తున్నాడు ఈ యంగ్‌ హీరో. విజయ్‌దేవరకొండ నటించిన 'నోటా' విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాని దసరా బరిలో ఉంచాలన్నదే చిత్ర యూనిట్‌ కోరిక. 

ఆల్రెడీ వాళ్లు ఓ క్లారిటీతో ఉన్నారు. అయితే మన విజయ్‌దేవరకొండ విజన్‌ మైండ్‌తో ఆలోచించి ఈ సినిమాకి రిలీజ్‌ డేట్‌ని అభిమానులతో ఫిక్స్‌ చేయించాడు. నోటాను ఎప్పుడు విడుదల చేయాలో మీరే కన్‌ఫామ్‌ చేయండి అంటూ సోషల్‌ మీడియాలో ఓటింగ్‌ పోల్‌ నిర్వహించాడు. అక్టోబర్‌ 5,10, 18 తేదీల్లో ఏ డేట్‌కి 'నోటా' విడుదల చేయాలో ఓటేసి చెప్పండి.. అని విజయ్‌ దేవరకొండ నిర్వహించిన పోలింగ్‌లో అక్టోబర్‌ 5 కే ఎక్కువ ఓట్లు పడ్డాయి. దాంతో ఆ డేట్‌కే 'నోటా' విడుదలవుతోందంటూ విజయ్‌దేవరకొండ తాజాగా ప్రకటించాడు. 

తెలుగుతో పాటు తమిళంలో కూడా ఈ సినిమా విడుదల కానుంది. ఇకపోతే పెద్ద సినిమా అయిన ఎన్టీఆర్‌ 'అరవింద సమేత..' దసరా బరిలో ఉన్న సంగతి తెలిసిందే. అక్టోబర్‌ 11న 'అరవింద సమేత..' ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎన్టీఆర్‌ - త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. 

విజయ్‌దేవరకొండ చేస్తున్న ప్రమోషన్స్‌ హంగామా చూస్తుంటే, 'అరవింద సమేత..'కు 'నోటా'తో మనోడు గట్టి పోటీ ఇచ్చేలానే ఉన్నాడు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS