ఎప్పుడో ప్రేక్షకుల ముందుకు రావాల్సిన '2.0' చిత్రం నవంబర్ 29న ఫ్రెష్‌గా విడుదల డేట్ ఫిక్స్ చేసుకుంది. అయితే ఈ డేట్‌కి అయినా రోబో ప్రేక్షకుల ముందుకు వచ్చేనా? అంటే అనుమానమే అని విశ్వసనీయ వర్గాల సమాచారమ్. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇదే డేట్‌కి '2.0'ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే గట్టి పట్టుదలతో ఉన్నాడట డైరెక్టర్ శంకర్.
విజువల్ వండర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి ఆ విజువల్ ఎఫెక్ట్స్ కారణంగానే విడుదల ఆలస్యం కావస్తోంది. ముందుగా అనుకున్న గ్రాఫిక్స్‌లో చివరికి వచ్చేసరికి చిన్నా చితకా మార్పులు ఎక్కువైపోయాయట. దాంతో రీ గ్రాఫికల్ వర్క్ జరగడంతో అనుకున్న టైంకి వర్క్ కంప్లీట్ కావడం లేదట. ఏది ఏమైనా అక్టోబర్‌కల్లా టెక్నికల్ టీమ్ వర్క్ కంప్లీట్ చేసిస్తామని శంకర్‌కి మాటిచ్చారట.
దాంతో నవంబర్‌లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం ఖాయమే అని చిత్ర యూనిట్ ద్వారా అందుతోన్న సమాచారమ్. సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా, బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ విలన్‌గా నటిస్తున్నాడు. బ్రిటీష్ బ్యూటీ అమీజాక్సన్ హీరోయిన్గా నటిస్తోంది. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్లో దాదాపు 500 కోట్ల అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా ఈ విజువల్ వండర్ రూపొందుతోంది.