హృతిక్‌తో డాన్స్‌ డ్రామాకి ఢీ అంటే ఢీ.!

మరిన్ని వార్తలు

బాలీవుడ్‌లో గ్రీకువీరుడు అని ముద్దుగా పిలుచుకుంటారు హృతిక్‌ రోషన్‌ని. హ్యాండ్‌సమ్‌ లుక్స్‌, కండల వీరుడు, డాన్సులు, ఫైట్లలో దిట్ట.. ఇలా చెప్పుకుంటూ పోతే, హృతిక్‌ అంటే అమ్మాయిలు పడి చచ్చిపోతారంతే. దాదాపు ఇవే లక్షణాలతో ఇప్పుడు కుర్రకారుకు కిక్కెక్కిస్తున్న మరో బాలీవుడ్‌ హీరో టైగర్‌ ష్రాఫ్‌. ప్రముఖ నటుడు జాకీ ష్రాఫ్‌ తనయుడే ఈ టైగర్‌ ష్రాఫ్‌. 

'బాఘి', 'బాఘీ 2' తదితర చిత్రాలతో సక్సెస్‌ఫుల్‌ యాక్షన్‌ హీరోగా తనదైన ముద్ర వేశాడు టైగర్‌ ష్రాఫ్‌. ముఖ్యంగా డాన్సుల్లో అతని ప్రతీ కదలిక హృతిక్‌ రోషన్‌ని తలపిస్తూ ఉంటుంది. నిజానికి జాకీ ష్రాఫ్‌ అంత బాగా డాన్సులు చేయడానికి హృతిక్‌రోషనే ఇన్స్‌ప్రేషన్‌ అట. ఆయనతో కలిసి ఇప్పుడు ఓ డాన్స్‌ డ్రామాలో నటిస్తున్నాడు టైగర్‌ ష్రాఫ్‌. ఆయన ఎంతగానో అభిమానించే హీరోతో కలిసి నటించడం, ఆయన ఎదురుగా నిలబడి డాన్స్‌ చేయడం అంటే భయంగా ఉందంటున్నాడు టైగర్‌ ష్రాఫ్‌. 

గౌరవంతో కూడిన భయం అది. టైగర్‌ ష్రాఫ్‌ ప్రస్తుతం 'స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2' సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని కరణ్‌జోహార్‌ నిర్మిస్తున్నారు. పునీత్‌ మల్హోత్రా దర్శకుడు. అనన్యాపాండే హీరోయిన్‌గా నటిస్తోంది. మరోవైపు టైగర్‌ ష్రాఫ్‌ త్వరలో హాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వబోతున్నాడనీ బాలీవుడ్‌ వర్గాల సమాచారమ్‌. 

ఈ విషయమై హాలీవుడ్‌ ప్రముఖ నిర్మాతలు, టైగర్‌తో చర్చలు జరుపుతున్నారనీ తెలుస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS