ప్రేక్షకులను ఎన్టీఆర్ అలా థ్రిల్ చేస్తారట

మరిన్ని వార్తలు

రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా 'RRR' అనే భారీ బడ్జెట్ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కరోనా వైరస్ కారణంగా అన్ని సినిమాలతో పాటు ఈ సినిమా షూటింగ్ కూడా నిలిచిపోయింది. ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్లు మాత్రం ఏదో ఒక రూపంలో వస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర గురించి మరో ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే ఎన్టీఆర్ ఆ పాత్రకు సంబంధించిన గెటప్ కూడా ఇప్పటికే బయటకు వచ్చింది.

 

అయితే ఈ సినిమాలు ఎన్టీఆర్ ఈ ఒక్క గెటప్ లో మాత్రమే కనిపించడని, మొత్తం ఆరు గెటప్పుల్లో కనిపిస్తారని సమాచారం అందుతోంది. శత్రువుల బారి నుంచి తప్పించుకునేందుకు, వారిని బురిడీ కొట్టించేందుకు ఎన్టీఆర్ తన గెటప్పులు మారుస్తూ తిరుగుతారట. మరి ఎలాంటి విభిన్నమైన గెటప్పుల్లో కనిపిస్తారు? అవి ఎలా ఉంటాయనేది మాత్రం ఇంకా బయటకు రాలేదు. ఏదేమైనా ఎన్టీఆర్ ఇలా ఆరు రకాల గెటప్స్ లో కనిపించడం ప్రేక్షకులను థ్రిల్ చేస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS