అదే ఎన్టీఆర్‌, అదే ఏఎన్నార్‌!

మరిన్ని వార్తలు

ఈ రోజు అక్కినేని నాగేశ్వరరావు జయంతి. ఈ నేపథ్యంలో 'ఎన్టీఆర్‌' బయోపిక్‌ నుంచి సుమంత్‌ 'అక్కినేని నాగేశ్వరరావు' పాత్రని విడుదల చేశారు. కొన్ని గంటల తర్వాత మరో లుక్‌ బయటకు వచ్చింది. ఒకదాన్ని మించిన లుక్‌ ఇంకొకటి. రెండో లుక్‌లో స్వర్గీయ ఎన్టీఆర్‌తోపాటు, స్వర్గీయ ఏఎన్నార్‌ కూడా కన్పించారు. 

అదే స్పెషల్‌. స్వర్గీయ ఎన్టీఆర్‌ పాత్రలో బాలకృష్ణ, స్వర్గీయ ఏఎన్నార్‌ పాత్రలో సుమంత్‌ నటిస్తున్న సంగతి తెల్సిందే. ఫొటో చూస్తే అందులో బాలకృష్ణ, సుమంత్‌ కాకుండా స్వర్గీయ ఎన్టీఆర్‌, స్వర్గీయ ఏఎన్నార్‌ పాత్రలే కన్పిస్తాయి. అంత నేచురల్‌గా ఆ గెటప్స్‌ని తీర్చిదిద్దారు. విలక్షణ చిత్రాల దర్శకుడు క్రిష్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెల్సిందే. ఈ సినిమాలో స్వర్గీయ ఎన్టీఆర్‌ అల్లుడు నారా చంద్రబాబునాయుడు పాత్రని రానా దగ్గుబాటి పోషిస్తున్నాడు. అసలు రానాని చంద్రబాబు పాత్రలో క్రిష్‌ ఊహించుకోవడమే ఓ అద్భుతం. 

అంతకు మించిన అద్భుతం చంద్రబాబు పాత్రకు తగ్గట్టు రానా తనను తాను మలచుకోవడం. ఇలా 'ఎన్టీఆర్‌' బయోపిక్‌ విడుదలకు ముందే బోల్డన్ని సంచలనాలకు కేంద్ర బిందువవుతోంది. స్వర్గీయ ఎన్టీఆర్‌ సతీమణి బసవతారకం పాత్రలో విద్యాబాలన్‌ నటిస్తున్న సంగతి తెల్సిందే. ఆ గెటప్‌ మరింత సర్‌ప్రైజింగ్‌గా వుండబోతోందట.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS