త్రివిక్రమ్ - ఎన్టీఆర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమాకి 'అరవింద సమేత వీర రాఘవ' అనే టైటిల్‌ని ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్‌లో ఉన్న స్టిల్‌ని విడుదల చేశారు. ఆ స్టిల్‌కి మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.
దాంతో పాటు మరికొన్ని స్టిల్స్ కూడా రిలీజ్ చేశారు. సిక్స్ ప్యాక్ స్టిల్ చూసి ఎన్టీఆర్‌ని ఓన్లీ మాస్ అనుకుంటే పొరపాటే అన్నట్లుగా ఉన్నాయి తాజా స్టిల్స్. పూజాహెగ్దేతో ఎన్టీఆర్ కలిసి ఉన్న స్టిల్స్ అవి. టోటల్‌గా ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్స్ చాలా డిఫరెంట్‌గా ఉండబోతున్నాయని తెలుస్తోంది. అలాగే చాలా సరదాగా, చాలా ఎనర్జిటిక్‌గా కనిపించబోతున్నాడట ఎన్టీఆర్. మరో వైపు ఈ సినిమాలోని యాక్షన్ సీన్స్‌ని కూడా వైవిధ్యంగా కంపోజ్ చేయనున్నారట.
అందులో భాగంగానే, 'అత్తారింటికి దారేది' చిత్రంలోని స్పెట్స్ ఫైట్ ఉంటుంది కదా. ఆ తరహాలో ఓ సరికొత్త యాక్షన్ సీక్వెన్స్ ఈ సినిమాలో ఉండబోతోందట. త్రివిక్రమ్‌కీ, ఎన్టీఆర్‌కీ ఇద్దరికీ ఈ సినిమా ఎంతో స్పెషల్. అంతేకాదు, ఇద్దరికీ ఖచ్చితంగా సక్సెస్‌ని ఇచ్చి తీరాల్సిన సినిమా కూడా. 'అజ్ఞాతవాసి' ఎఫెక్ట్‌తో ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందించిన దర్శకుడిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎంత డిజప్పాయింట్ అయ్యాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
అయితే ఇప్పుడు ఎన్టీఆర్ సినిమా సెట్స్ మీదికెళ్లాక, ఔట్‌పుట్ వస్తున్న దాన్ని బట్టి, మళ్లీ కాన్ఫిడెన్స్ బాగా పెరిగిందట త్రివిక్రమ్‌లో. ఖచ్చితంగా ఈ సినిమాతో హిట్ కొడతాననే నమ్మకంతో ఉన్నాడట త్రివిక్రమ్. హారికా హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ మరో ప్రధాన ఆకర్షణ కానుంది.