ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న 'సాహో' సినిమా దుబాయ్‌లో షూటింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇక్కడి దాకా బాగానే ఉంది. అయితే అది ఎంత భారీ బడ్జెట్టో తెలుసా?
మామూలుగా యాక్షన్ సీక్వెన్స్ కోసం షూటింగ్స్‌లో పాడైపోయిన, ఆల్రెడీ డ్యామేజ్ అయిన కార్లను వాడుతుంటారు. కానీ ఈ సినిమా కోసం అన్నీ ఒరిజినల్ కార్లను ఉపయోగిస్తున్నారట. ఒరిజినల్ కార్లను ఓ ఫైట్ సీన్ కోసం తగలబెట్టేశారట. ఎందుకిలా చేస్తున్నారంటే, సీన్‌లో నేచురాలిటీ కోసమే అంటోంది చిత్ర యూనిట్. ఎక్కడా రాజీపడకుండా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారనడానికి ఇదే బెస్ట్ ఎగ్జామ్‌పుల్.
హాలీవుడ్ ప్రముఖ కొరయోగ్రాఫర్లు ఈ సినిమాకి పని చేస్తున్నారు. ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌పై ఇంతకుముందెన్నడూ చూడని యాక్షన్ సీన్స్‌ని ఈ చిత్రంలో చూడబోతున్నామట. హీరోయిన్ శ్రద్ధా కపూర్ కూడా యాక్షన్ సీన్స్‌లో జోష్‌గా పాల్గొంటోంది. మరోవైపు షూటింగ్ నుండి కాస్త విరామం దొరికినా ప్రబాస్, సెట్స్‌లో తనకు అత్యంత సన్నిహుతులతో విహార యాత్రలకు వెళుతున్నాడట. అంటే దుబాయ్‌లోని ప్రముఖ మసీదులు, బెస్ట్ వ్యూ స్పాట్స్‌ని సందర్శిస్తున్నాడట. అక్కడి మీడియాతో ప్రబాస్ బాగా ఇంటరాక్ట్ అవుతున్నాడట.
అలా 'సాహో' టీమ్ దుబాయ్‌లో షూటింగ్‌ని ఎంజాయ్ చేస్తోంది. యంగ్ దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.