ప్రముఖ నటుడు ఉత్తేజ్ సొంత వస్త్ర దుకాణంలో చోరీ జరిగింది.
వివరాల్లోకి వెళితే, ఉత్తేజ్ భార్య పద్మావతి హైదరాబాద్ లోని ఎల్లారెడ్డి గూడాలో ఒక వస్త్ర దుకాణాన్ని నిర్వహిస్తున్నారు. నిన్నటిరోజున దుకాణంలో రద్ది ఎక్కువ ఉన్న సమయంలో కొందరు మహిళలు చీరలు కొనే నెపంతో దుకాణంలోకి వచ్చి ఖరీదైన చీరలని దొంగిలించారు.
అయితే రాత్రి దుకాణం మూసేసే సమయంలో చీరాల లెక్క తేడా రావడంతో అనుమానం వచ్చి CCTV లని పరిశీలించగా చీరాల దొంగతనం భయటపడిందట. వెంటనే ఈ విషయాన్నీ సంబందిత పోలీసు స్టేషన్ లో రిపోర్ట్ చేయగా వారు కేసు నమోదు చేసి ఆ ఫుటేజ్ ని పరీశిలిస్తున్నట్టు సమాచారం.
ఏదేమైనా.. ఆడవాళ్ళు ఇలా ముగ్గురు నలుగురు చీరలు కొనే నెపంతో రావడం ఇలా దొంగతనాలు చేయడం ఈ మధ్యకాలంలో సర్వసాధారణం అయిపొయింది.