ఓవర్సీస్‌లో 'ఓ బేబీ' రన్ రేట్ సూపర్ ఫాస్ట్‌గా ఉంది. ఈ శుక్రవారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లోనూ 'ఓ బేబీ'కి మంచి గుర్తింపు దక్కించుకుంటోంది. ఓపెనింగ్స్‌తోనే ఓహో అనిపించిన 'ఓ బేబీ' వీకెండ్ అదరగొట్టేసింది. ఓవర్సీస్‌లోనూ మంచి వసూళ్లు రాబట్టింది. అతి త్వరలోనే 1 మిలియన్ వసూళ్లు రాబట్టేలా పరుగులు పెడుతోంది. ఇంతటి ఘన విజయం అందించినందుకు 'ఓ బేబీ' టీమ్, ఫ్యాన్స్‌కి థాంక్స్ చెబుతూ థాంక్స్ మీట్ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి రానా ముఖ్య అతిధిగా విచ్చేశాడు.
సమంత సినిమాని ఇంత సక్సెస్ చేసినందుకు ఆయన కూడా ఫ్యాన్స్‌కి థాంక్స్ చెప్పారు. అంతేకాదు, కొరియన్ కథలంలే తనకెంతో ఇష్టమనీ, తనకు కూడా కొరియన్ స్క్రిప్టులు వినిపించాలని రానా సరదాగా కామెంట్ చేశారు. ఇదిలా ఉంటే, 'ఓ బేబీ' టాక్ తర్వాత, చైనాలో కూడా ఈ సినిమాని విడుదల చేయాలని అక్కడి నిర్మాతలు అడుగుతున్నారట. ఈ మధ్య చైనాలో మన తెలుగు సినిమాలకు మార్కెట్ బావుంది.
'బాహుబలి' పుణ్యమా అని తెలుగు మార్కెట్ చైనా వరకూ విస్తరించింది. తెలుగులో బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు కొన్ని అక్కడ కూడా సక్సెస్ అవుతున్నాయి. 'ఓ బేబీ' కాన్సెప్ట్ చైనీస్‌ని కూడా అలరించేలా ఉంటుందని, త్వరలోనే 'ఓ బేబీ'ని అక్కడికి కూడా షిఫ్ట్ చేసే యోచనలో నిర్మాతలున్నట్లు తెలుస్తోంది. నందినీ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకి సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాణ భాగస్వామ్యం వహించిన సంగతి తెలిసిందే.