ఎన్టీఆర్ లుక్‌: అన్న‌గారే... దిగొచ్చారా?

మరిన్ని వార్తలు

'ఎన్టీఆర్‌' లుక్స్ విష‌యంలో ద‌ర్శ‌కుడు క్రిష్ చాలా జాగ్ర‌త్త‌గానే వ్య‌వ‌హ‌రిస్తున్నాడ‌ని చెప్పాలి. ఇప్ప‌టి వ‌ర‌కూ విడుద‌ల చేసిన లుక్స్‌లో వంక పెట్ట‌డానికి ఏమీ లేకుండా జాగ్ర‌త్త ప‌డ్డాడు. మ‌రీ ముఖ్యంగా ఎన్టీఆర్‌గా బాల‌య్య లుక్కుల‌ను విడుద‌ల చేసిన‌ప్పుడు.. మ‌రింత ప‌ర్‌ఫెక్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. 'ఎన్టీఆర్‌' బ‌యోపిక్‌లో బాల‌య్య 'క‌థానాయ‌కుడు', 'మ‌హా నాయ‌కుడు'గా క‌నిపించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే.

ఈ రెండు గెట‌ప్పులూ దాదాపుగా బ‌య‌ట‌కు వ‌చ్చేశాయి. ఇప్పుడు మ‌రో కొత్త స్టిల్ వ‌దిలారు. అసెంబ్లీ ముందు, వేలాది కార్య‌కర్త‌ల స‌మ‌క్షంలో, పంచెక‌ట్టుతో... బాల‌య్య వ‌డి వ‌డిగా అడుగులు వేస్తున్న దృశ్య‌మిది. బాల‌య్య హావ‌భావాలు, న‌డ‌క‌, స్టైల్ ఇవ‌న్నీ చూస్తే.. పెద్దాయ‌నే దిగొచ్చారా అనిపించేలా ఉంద‌న్న‌ది అభిమానుల మాట‌.

ఎన్టీఆర్ బ‌యోపిక్ శ‌ర‌వేగంగా రూపుదిద్దుకొంటోంది. రేపు (ఆదివారం) ఉద‌యం  7.42 గంట‌ల‌కు 'క‌థానాయ‌కుడు' లోంచి 'క‌థానాయ‌క‌' అనే పాట‌ని విడుద‌ల చేయ‌నున్నారు. వారం వారం ఓ పాట‌ని విడుద‌ల చేసుకుంటూ.. ప్ర‌మోష‌న్ల‌ను ముమ్మ‌రం చేయాల‌ని చిత్ర‌బృందం భావిస్తోంది. కీర‌వాణి సంగీతం అందించిన ఈ చిత్రంలో రానా, విద్యాబాల‌న్‌, సుమంత్‌, క‌ల్యాణ్‌రామ్ కీల‌క పాత్ర‌లు పోషించిన సంగ‌తి తెలిసిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS