ఇది క్లియర్‌ 'ఎన్టీఆర్‌' సినిమా ఆగిపోయింది?

మరిన్ని వార్తలు

భారీ అంచనాలతో పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో గ్రాండ్‌గా ఓపెన్‌ అయిన 'ఎన్టీఆర్‌' చిత్రం దర్శకత్వం నుండి తేజ అర్ధాంతరంగా తప్పుకోవడంతో సినిమా షూటింగ్‌ తాత్కాలికంగా ఆగిపోయింది. 

అయితే తేజ స్టార్ట్‌ చేసిన ఈ సినిమాని తర్వాత ఎవరి చేతిలో పెట్టాలో తెలియని సందిగ్థంలో బాలయ్య ఉన్నారట. ఎన్టీఆర్‌ బయోపిక్‌ని ఒక్క సినిమాగా కాదు, చాలా సినిమాలుగా తెరకెక్కించాలి. ఒక్క సినిమాలో ఆయన గురించి చెప్పడం సాధ్యం కాని పని.. అని తేజ మొదట్లోనే చెప్పేశారు. రాను రాను సినిమాని టేకప్‌ చేయడం కష్టం కావడంతోనే నా వల్ల కాదనీ చేతులెత్తేశారు. సినిమా కథపై అప్పటికే తేజకి ఓ క్లారిటీ లేదు కూడా. 

ఇన్ని కారణాలతోనే ఆయన ఈ ప్రాజెక్ట్‌ నుండి తప్పుకోవడం జరిగింది. దాంతో ఇప్పుడు ఆ మహానుభావుని చరిత్రని తెరకెక్కించే బాధ్యత ఎవరు తీసుకోబోతున్నారనే అంశంపై అంతటా ఉత్కంఠ నెలకొన్న సంగతి తెలిసిందే. బయోపిక్స్‌ తెరకెక్కించడం అంటే అంత ఆషామాషీ కాదు. అందులోనూ స్వర్గీయ ఎన్టీఆర్‌లాంటి మహోన్నత వ్యక్తుల జీవిత చరిత్రలు మరీ ఒళ్లు దగ్గర పెట్టుకొని తెరకెక్కించాలి. ఈ ప్రాజెక్ట్‌ నుండి తేజ తప్పుకుని రోజులు గడుస్తున్నా కానీ నెక్ట్స్‌ డైరెక్టర్‌ ఎవరనే విషయంలో క్లారిటీ రావడం లేదు. వచ్చేలా కూడా కనిపించడం లేదు. 

మరో పక్క యంగ్‌ డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌ సావిత్రి జీవిత గాథని 'మహానటి' పేరుతో తెరకెక్కించి శభాష్‌ అనిపించేసుకున్నాడు. సినీ మహా దిగ్గజాలతో ప్రశంసలు పొందుతున్నాడు. అలాంటిది ఈ తరుణంలో 'ఎన్టీఆర్‌' బయోపిక్‌ ఎలా తెర రూపం దాల్చుతుందో తెలియని పరిస్థితిలో అభిమానులుండగా, మరోవైపు బాలయ్య కూడా దాదాపు ఈ ప్రాజెక్ట్‌ని పక్కన పెట్టేశాడంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. చూడాలి మరి ఈ ప్రచారంలో నిజమెంతుందో.!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS