ఎన్టీఆర్ బయోపిక్ కి సంబంధించిన 'బిగ్ న్యూస్' ఇదే..

By iQlikMovies - October 03, 2018 - 21:20 PM IST

మరిన్ని వార్తలు

ఎన్టీఆర్ బయోపిక్ కి సంబంధించిన ప్రతి వార్త ఒక సంచలనమనే చెప్పాలి. ఎందుకంటే ఈ బయోపిక్ చేద్దాము అని అనుకున్న సమయం నుండి ఈ క్షణం వరకు ఎన్నో మార్పులు చేర్పులు జరుగుతూనే వస్తున్నాయి.

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఒక కీలక సమాచారం బయటికొచ్చింది. అదేమనగా- ఈ ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకి తీసుకురానున్నారట. అందులో మొదటి భాగం జనవరి 9న విడుదలకానుండగా రెండవ పార్ట్ అదే నెల 26న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. 

ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం- స్క్రిప్ట్ మొత్తం చూసుకుంటే సుమారు 164 సీన్స్ వచ్చాయట. అందుకనే ఈ బయోపిక్ ని రెండు భాగాలుగా విడుదల చేద్దాము అని ఆలోచన చేశారట.

ఇక దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రేపు వెలువడనుంది. ఇప్పటికే ఈ బయోపిక్ లో తెలుగు చిత్ర పరిశ్రమకి లోని అగ్రతారలు నటిస్తున్నారు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS