ఈరోజు ఎన్టీఆర్ పుట్టిన రోజు. నందమూరి అభిమానులకు పండగ రోజు. ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా `ఆర్.ఆర్.ఆర్` నుంచి ఓ పోస్టర్ వస్తుందని ముందే.. ప్రకటించేశారు. అందుకే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కళ్ళల్లో ఒత్తులు వేసుకుని మరీ ఎదురు చూశారు. సరిగ్గా 10 గంటలకు ఎన్టీఆర్ పోస్టర్ ఒకటి బయటకు వచ్చింది. చేతిలో బల్లెం పట్టుకుని, లక్ష్యం వైపు కసిగా చూస్తున్న ఎన్టీఆర్ ఫొటో అది. చూడగానే.. ఫ్యాన్స్ కి ఆ పోస్టర్ నచ్చేసినా.. అంత కిక్ మాత్రం రాలేదన్నది వాస్తవం.
నిజానికి ఇది ఫ్యాన్ మేడ్ పోస్టర్ లా ఉందే తప్ప, రాజమౌళి టీమ్ విడుదల చేసిన పోస్టర్ లా లేదన్న విమర్శలు ఎక్కువగా వినిపించాయి. 400 కోట్లతో తెరకెక్కిన సినిమా ఇది. ఆ స్థాయిలో పోస్టర్ కనిపించలేదు. పైగా రాజమౌళి అనేవాడు మిస్టర్ పర్‌ఫెక్ట్. అతన్నుంచి సాదా సీదా గిఫ్టులెవరూ ఊహించరు. చిన్న పోస్టరైనా సరే, ఏదో ఓ ఆకర్షణ, విస్మయానికి గురి చేసేలా ఉండాలి. కానీ.. కొమరం బీమ్ పోస్టర్ అలా లేదు. దాంతో.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ హర్టయ్యారు. ఆర్.ఆర్.ఆర్ నుంచి మరో సర్‌ప్రైజ్‌రావాలంటే ఇంకా చాలా రోజులు పడుతుంది. అప్పటి వరకూ ఈ విమర్శల్ని రాజమౌళి ఎదుర్కొంటూనే ఉండాలి.