అతి చేసిన‌ ఫ్యాన్స్... ఎన్టీఆర్ గుస్సా

By Gowthami - January 09, 2020 - 09:30 AM IST

మరిన్ని వార్తలు

ఏ హీరోకైనా అభిమానులే బ‌లం. అయితే వాళ్లే ఒక్కోసారి బ‌ల‌హీన‌త‌గా మారుతుంటారు. అభిమానుల ఉత్యుత్సాహం హీరోల‌కు త‌ల‌నొప్పిని తీసుకొస్తాయి. ఎన్టీఆర్ విష‌యంలో అదే జ‌రిగింది. అభిమానుల ఓవ‌ర్ యాక్ష‌న్ వ‌ల్ల‌... తాను మాట్లాడాల్సింది మాట్లాడ‌కుండానే వెనుదిరిగారు నంద‌మూరి హీరోలు. ఈ విష‌యంలో ఎన్టీఆర్ కాస్త కోపంగా ఉన్నాడ‌ని తెలుస్తోంది.

 

క‌ల్యాణ్ రామ్ న‌టించిన చిత్రం `ఎంత మంచివాడ‌వురా` ఈనెల 15న విడుదల అవుతోంది. ఇందుకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ హైద‌రాబాద్‌లోని జేఆర్‌సీలో జ‌రిగింది. క‌ల్యాణ్ రామ్ సినిమా వేడుక అంటే ఎన్టీఆర్ హాజ‌రు త‌ప్ప‌ని స‌రి. ఈసారీ అన్న‌య్య కోసం ఎన్టీఆర్ వ‌చ్చాడు. అయితే.. అభిమానుల వ‌ల్ల - తాను స‌రిగా మాట్లాడ‌కుండానే వెనుదిరిగాడు. జేఆర్‌సీలో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మానికి ప‌రిమితికి మించి ఫ్యాన్స్ వ‌చ్చేశారు. దాంతో.. వేదిక‌పై ఎవ‌రెళ్లినా వాళ్ల‌ని స‌రిగా మాట్లాడ‌నివ్వ‌లేదు. వాళ్ల అరుపులు, కేక‌ల‌తో హోరెత్తించేశారు. ఏ హీరో అయినా ఇలాంటి హంగామానే కోరుకుంటాడు. కాక‌పోతే ఈసారి కాస్త ఓవ‌ర్‌గా జ‌రిగింది. క‌ల్యాణ్ రామ్ మాట్లాడుతున్న స‌మ‌యంలోనూ ఫ్యాన్స్ గోల మాన‌లేదు.

 

దాంతో క‌ల్యాణ్ రామ్ పొడి పొడిగా మాట్లాడి వెళ్లిపోయాడు. ఎన్టీఆర్ ద‌గ్గ‌ర కూడా ఇదే సీన్ రిపీట్ అయ్యింది. దాంతో ఓ సంద‌ర్భంలో ఎన్టీఆర్ కూడా ఫ్యాన్స్‌ని హెచ్చ‌రించాడు. ఇలానే గొడ‌వ చేశారంటే, మాట్లాడ‌కుండా వెళ్లిపోతా అన్నాడు. అప్ప‌టికి కాస్త శాంతించారు. అయినా స‌రే, ఎన్టీఆర్ ప్ర‌సంగం కూడా పొడిపొడిగానే సాగింది. అస‌లు ఈ కార్య‌క్ర‌మం న‌డిచిన తీరే ఎన్టీఆర్‌కి పెద్ద‌గా న‌చ్చ‌లేద‌ని తెలుస్తోంది. నిర్వాహ‌కుల‌పై కూడా ఎన్టీఆర్ చిరుబురులాడాడ‌ని స‌మాచారం. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS