ఆర్.ఆర్.ఆర్...సూపర్ డూపర్ హిట్టయ్యింది. కానీ... ఎన్టీఆర్ అభిమానుల్లో ఎక్కడో చిన్న నిరాశ. ఎన్టీఆర్ పాత్ర ప్రధాన్యం కొంచెం తగ్గిందని, ఆ విషయంలో రాజమౌళి తమకు అన్యాయం చేశాడని, ఇప్పటికీ మొత్తుకుంటూనే ఉన్నారు. ఎన్టీఆర్‌కి కూడా తన అభిమానుల నిరాశ నిస్పృహలు అర్థమవుతూనే ఉన్నాయి. అందుకే తన తదుపరి సినిమాలో దానికి వడ్డీతో కలిపి మరీ చెల్లించాలని ఫిక్సయ్యాడు.
ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ చిత్రం రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఇందులో ఎన్టీఆర్ అభిమానులకు కావల్సిన అన్ని మాస్ మసాలా అంశాల్ని మిక్స్ చేశాడట కొరటాల. వీరిద్దరి కాంబినేషన్ నుంచి జనతా గ్యారేజ్ అనే సూపర్ హిట్ సినిమా వచ్చింది. ఎన్టీఆర్ ని ఎలా చూపించాలో, కొరటాలకు బాగా తెలుసు. పైగా కొరటాల కూడా మంచి కసితో ఉన్నాడు. ఆచార్య ఫ్లాప్ అవ్వడం, అది తన కెరీర్‌పై విపరీతమైన ప్రభావం చూపించడం తెలిసిన విషయాలే. ఎలాగైనా సరే, ఆచార్య నుంచి బయటపడి, ఓ సూపర్ హిట్టు కొట్టి, తానేంటో నిరూపించుకోవాలన్న తపనతో ఉన్నాడు కొరటాల. అందుకే.. ఎన్టీఆర్ స్క్రిప్టుపై పూర్తి స్థాయిలో శ్రద్ధ పెట్టాడట. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా కొరటాలని పూర్తిగా నమ్ముతున్నారు. తమ ఆశలన్నీ కొరటాలపైనే పెట్టుకొన్నారు. ఈసారి ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి ఫుల్ మీల్స్ గ్యారెంటీ.