విజయ్ - వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘వారిసు . దిల్ రాజు నిర్మాత. ఇదే చిత్రాన్ని ‘వారసుడు’ పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమాని విడుదల చేస్తున్నట్లు ఇది వరకు ప్రకటించారు. అయితే ఇప్పుడీ డేట్ మారిపోయింది. జనవరి 11న సినిమా విడుదలౌతుంది.
ఇలా చివరి నిమిషంలో డేట్ మార్చడానికి కారణం..అజిత్ సినిమా తెగింపు. వారిసు, తెగింపు పోటాపోటీగా తెరకెక్కాయి. వారిసు తెలుగు డేట్ గతంలో చెప్పారు కానీ తమిళ్ సస్పెన్స్ లో ఉంచారు. కారణం అప్పటికి అజిత్ సినిమా ఇంకా డేట్ ఫిక్స్ కాలేదు,. ఇప్పుడు అజిత్ సినిమాని 11విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. వెంటనే విజయ్ సినిమా డేట్ కూడా మారిపోయింది.
ఇక సంక్రాంతి తెలుగు సినిమాల విషయానికి వస్తే 12వ తేదీన బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమా రిలీజ్ అవుతోంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఆ తర్వాత 13వ తేదీన చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా రిలీజ్ అవుతోంది. బాబి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై కూడా భారీ అంచనాలున్నాయి. మొత్తానికి రెండు తెలుగు సినిమాలు రెండు డబ్బింగ్ సినిమాలతో ఈ సంక్రాంతి బాక్సాఫీసు వార్ రసవత్తరంగా మారింది.