కొద్దికాలంగా ప్రముఖ నటుడు వేణుమాధవ్ సినిమాలకు దూరమై మళ్ళీ ఈమధ్యనే రాజకీయ వ్యాఖ్యానాలు చేస్తూ మీడియాలో హల్చల్ చేస్తున్నాడు.
ఇక వేణుమాధవ్ మొన్ననే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ- పవన్ కళ్యాణ్ ఎప్పటికి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాడని అలాగే 2019లో కూడా తెలుగుదేశం పార్టీ తో కలిసి పనిచేస్తాడు అని చెప్పాడు.
ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఇటు సినీ పరిశ్రమలో అటు రాజకీయాల్లోప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఒక పక్క పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో చాలా కీలకంగా మారుతాడు అని విశ్లేషిస్తున్న ఈ తరుణంలో వేణుమాధవ్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
మొత్తానికి వేణుమాధవ్ చాలా కాలానికి మాట్లాడిన ఒక సంచలనానికి దారితీసే వ్యాఖ్యలు అయితే చేసేశాడు.