అన్న కోసం ఎన్టీఆర్ మ‌రో సినిమా?

By iQlikMovies - August 05, 2019 - 14:30 PM IST

మరిన్ని వార్తలు

ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌లో ఎన్టీఆర్ క‌థానాయ‌కుడిగా న‌టించిన చిత్రం `జై ల‌వ‌కుశ‌`. ఈ సినిమా మంచి లాభాల‌నే ఆర్జించింది. వ‌రుస ఫ్లాపుల‌తో ఉన్న క‌ల్యాణ్ రామ్‌కి ఈ హిట్టు ఉప‌శ‌మ‌నం క‌లిగించింది. ఇప్పుడు అన్న‌య్య కోసం ఎన్టీఆర్ మ‌రో సినిమా చేయ‌బోతున్నాడ‌ని టాక్‌. ఎన్టీఆర్ ఆర్ట్‌లో, క‌ల్యాణ్ రామ్ నిర్మాత‌గా ఎన్టీఆర్ న‌టించే రెండో సినిమాకి రంగం సిద్ధం అవుతోంద‌ని స‌మాచారం.

 

ఈ చిత్రానికి త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తార‌ని తెలుస్తోంది. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో 'అర‌వింద స‌మేత వీర రాఘ‌వ‌' వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఆ స‌మ‌యంలోనే త్రివిక్ర‌మ్ - ఎన్టీఆర్ ల మ‌ధ్య బాండింగ్ మ‌రింత బ‌ల‌ప‌డింది. క‌లిసి మ‌రో సినిమా చేద్దాం...అని అప్పుడే ఫిక్స‌య్యారు. ఇప్పుడు అది కార్య‌రూపం దాల్చ‌బోతోంది. ఎన్టీఆర్ ప్ర‌స్తుతం `ఆర్‌.ఆర్‌.ఆర్‌` షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా పూర్త‌యిన వెంట‌నే త్రివిక్ర‌మ్ సినిమా మొద‌ల‌వుతుంద‌ని టాక్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS