ఎన్టీఆర్‌గా బాలయ్య తండ్రిని మించిన తనయుడు.!

By iQlikMovies - August 14, 2018 - 19:11 PM IST

మరిన్ని వార్తలు

స్వర్గీయ నందమూరి తారకరామారావు బయోపిక్‌ అయిన 'ఎన్టీఆర్‌' చిత్రం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నటించే నటీ నటుల వివరాలు ఒక్కొక్కటిగా అఫీషియల్‌గా బయటికి వస్తున్నాయి. 

ఇకపోతే ఈ సినిమా ఫస్ట్‌లుక్స్‌ సందడి మొదలైంది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఒకరోజు ముందే ఎన్టీఆర్‌ పాత్రలో బాలయ్య ఫస్ట్‌లుక్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్‌. ఎన్టీఆర్‌ అంటే తనదైన వేషధారణతో తెలుగు ప్రజల మనసుల్ని గెలచుకున్నారు. ఆ బాడీ లాంగ్వేజ్‌, ఆ దర్పం, వేష ధారణ తెలుగు ప్రేక్షకుల మనసు నుండి ఎప్పటికీ చెరిగిపోవు. హీరోగా వంద సినిమాలకు పైగా నటించిన బాలయ్యకు ఈ సినిమా కత్తి మీద సామే. తండ్రి ఎన్టీఆర్‌ పాత్ర పోషించడం అంటే కేవలం నటనే కాదు, ఎంతో బాధ్యతగానూ, భక్తితోనూ చేయాల్సిన పాత్ర అని కొన్ని సందర్భాల్లో బాలయ్యే స్వయంగా చెప్పారు. 

2019 ఎలక్షన్స్‌కి ముందు ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ భార్య బసవతారకం పాత్రలో బాలీవుడ్‌ నటి విద్యాబాలన్‌ నటిస్తోంది. చంద్రబాబు పాత్రలో రానా నటిస్తున్నాడు. ఆల్రెడీ టెస్ట్‌ షూట్‌ జరుపుకున్న రానా షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. లేటెస్టుగా రానా భార్య పాత్రలో అంటే భువనేశ్వరి పాత్రలో మలయాళ బ్యూటీ మంజిమా మోహన్‌ ఎంపికైనట్లు తెలుస్తోంది. అతిలోక సుందరి శ్రీదేవి పాత్రలో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో ఆయన మనవడు నాగచైతన్య పేర్లు పరిశీలనలో ఉన్నాయి. 

ప్రముఖ దర్శకుడు క్రిష్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS