ఫ్యాన్స్‌ ఆగ్రహానికి గురైన జక్కన్న ఏం చేస్తాడు.?

మరిన్ని వార్తలు

రాజమౌళి ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సెట్స్‌ మీదికి వెళ్లి ఏడాది కావస్తున్నా, ఇంతవరకూ ఎలాంటి అప్‌డేట్‌ ఇవ్వలేదు సినిమాకి సంబంధించి. ఎన్టీఆర్‌, చరణ్‌ వంటి స్టార్‌ హీరోల మల్టీ స్టారర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాపై అనౌన్స్‌మెంట్‌ డే నుండీ ఆసక్తి నెలకొన్న సంగతి తెలిసిందే. కానీ, ఫ్యాన్స్‌ సహనానికి రాజమౌళి పరీక్ష పెడుతున్నాడు. దసరా, దీపావళి, సంక్రాంతి, న్యూ ఇయర్‌.. ఇలా అన్ని పండగలూ చకచకా వెళ్లిపోయాయ్‌ కానీ, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ అప్‌డేట్‌ ఇవ్వడంలో జక్కన్న ఎప్పటికప్పుడే నిరాశ పరుస్తూ వచ్చాడు. కానీ ఇక నిరాశ పరచడం సబబు కాదనుకున్నాడో ఏమో, మార్చిలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నుండి ఫ్యాన్స్‌కి ఓ సర్‌ప్రైజ్‌ ఇవ్వాలని డిసైడ్‌ అయ్యాడట.

 

ఇంతకీ మన జక్కన్న సడెన్‌గా ఇలాంటి డెసిషన్‌ తీసుకోవడానికి కారణం వేరే ఉంది. లేటెస్ట్‌గా సోషల్‌ మీడియాలో ఓ నెటిజన్‌, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ పేజీని ట్యాగ్‌ చేస్తూ, ఇంకెప్పుడు అప్‌డేట్‌ ఇస్తావ్‌..’ అని డైరెక్ట్‌గా రాజమౌళిని కోపంగా ప్రశ్నించేసరికి ఏమనుకున్నాడో ఏమో, జక్కన్న దిగొచ్చాడు. మార్చి నుండి అప్‌డేట్స్‌ వస్తాయి.. అంటూ చిత్ర యూనిట్‌ నుండి రిప్లై ఇప్పించాడు. అయితే, మార్చిలో రామ్‌చరణ్‌ బర్త్‌డే ఉన్న కారణంగా ఆ రోజు ఖచ్చితంగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ అప్‌డేట్‌ ఇవ్వాలని ఎప్పటి నుండో రాజమౌళి అండ్‌ టీమ్‌ అనుకుంటున్నారట. ఇకపోతే, ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్‌ కానుందని ఇటీవలే జక్కన్న ప్రకటించిన సంగతి తెలిసిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS