దొంగలా శ్రీవిష్ణు ‘రాజ’సం చూశారా.?

మరిన్ని వార్తలు

విలక్షణ నటుడు శ్రీ విష్ణు బర్త్‌డే సందర్భంగా ఆయన నటించిన తాజా చిత్రంలోని ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌ చేసింది చిత్ర యూనిట్‌. పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌లో శ్రీవిష్ణు నటిస్తున్న చిత్రం ‘రాజ రాజ చోర’. టైటిల్‌ ఇంట్రెస్టింగ్‌గా ఉంది కదా.. గెటప్‌ కూడా సో ఇంట్రెస్టింగ్‌ అండ్‌ సో ఫన్నీ. రాజుగారి గెటప్‌లో భుజానికి ఓ బ్యాగ్‌ తగిలించుకుని రాజసంగా కనిపిస్తున్నాడు శ్రీవిష్ణు ఈ లుక్‌లో. అయితే, పేరులో రాజసం ఉంది కానీ, ఆయన ఓ దొంగ. దొంగతనం చేసి, ఏ బిల్డింగ్‌ మీద నుండో దూకి పారిపోతున్నట్లున్నాడు. గాల్లో ఎగురుతూ కనిపిస్తున్నాడు.

sree vishnu raja raja chora

ఇంతవరకూ శ్రీ విష్ణు కనిపించని కొత్త లుక్‌ ఇది. మంచి రెస్పాన్స్‌ వస్తోంది ఈ లుక్‌కి. ఐనా ఫస్ట్ లుక్తోనే ఆసక్తి రేకెత్తించడం శ్రీవిష్ణుకు ఇదేం కొత్త కాదు. ఆయన నటించిన గత చిత్రాల్లోనూ అంతే, ఏదో మ్యాజిక్‌ చేస్తాడు. మ్యాజిక్‌ ఉన్న స్టోరీస్‌నే ఎంచుకుంటాడు. హర్షిత్‌ గోలి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాతో మన శ్రీవిష్ణు ఏం మ్యాజిక్‌ చేస్తాడో చూడాలి మరి. ఇక ఈ సినిమాలో కృతి చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. ఇదిలా ఉంటే, శ్రీవిష్ణు నటించిన గత చిత్రం ‘బ్రోచేవారెవరురా’తో మంచి హిట్‌ కొట్టాడు. సస్పెన్స్‌ థ్ల్రిల్లర్‌ అండ్‌ ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంలో నివేదా థామస్‌ హీరోయిన్‌ కాగా, ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ కీలక పాత్రు పోషించిన సంగతి తెలిసిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS