జపాన్ లో ఎన్టీఆర్ ప్రమోషన్స్

మరిన్ని వార్తలు

ప్రస్తుతం తెలుగు సినిమా స్థాయి ఇంటర్ నేషనల్ లెవెల్ లో ఉంది. తెలుగు సినిమా అయినా, పాట అయినా, హీరో అయినా తగ్గేదేలేదన్నట్టు ఉంది ఫాలోయింగ్. ముఖ్యంగా తెలుగు సినిమాలకి జపాన్ లో మంచి మార్కెట్ ఉంది. హీరోలలో ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్ లకి ప్రత్యేక స్థానం ఉంది. వీరి సినిమాలు అన్నీ జపాన్ భాషలో రిలీజ్ అవుతుంటాయి. ఇప్పటికే బాహుబలి, RRR, కల్కి, లాంటి సినిమాలు జపాన్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నాయి. ఇప్పుడు ఎన్టీఆర్ దేవర మూవీ కూడా రిలీజ్ కి సిద్ధం అవుతోంది.

ఎన్టీఆర్ - కొరటాల కాంబోలో వచ్చిన 'దేవర' మూవీ సుమారు 600 కోట్లు కలెక్ట్ చేసింది. ఎన్టీఆర్ సోలోగా మొదటి  పాన్ ఇండియా హిట్ అందుకున్నాడు. దీంతో ఇపుడు జపాన్ లో దేవర మూవీ రిలీజ్ కి సర్వం సిద్ధం చేసారు మేకర్స్. సినిమాలు రిలీజ్ చేయటమే కాదు ప్రమోషన్స్ కూడా నిర్వహిస్తున్నారు మేకర్స్. దేవర సినిమా జపాన్ లో మార్చ్ 28న రిలీజ్ అవుతోంది. ఈ  సందర్భంగా ఎన్టీఆర్ అపుడే ప్రమోషన్స్ స్టార్ట్ చేసాడు. ఇప్పటికే జపాన్ మీడియాతో ఆన్ లైన్లో ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు.  ఈ విషయాన్ని ఎన్టీఆర్ టీమ్ స్వయంగా వెల్లడించింది. ఆన్ లైన్ లో ఎన్టీఆర్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఒక ఫొటో షేర్ చేసింది ఎన్టీఆర్ టీమ్.

దేవర ప్రమోషన్స్ కోసం ఎన్టీఆర్ మార్చ్ 22న జపాన్ కి వెళ్తున్నాడు. ఎన్టీఆర్ గతంలో కూడా RRR ప్రమోషన్స్ కి జపాన్ వెళ్ళాడు. తరువాత ఫ్యామిలీ తో కలిసి వెకేషన్ కి  జపాన్ వెళ్ళాడు. ఎన్టీఆర్ తిరిగి వచ్చిన రోజే జపాన్ లో భారీ భూకంపం వచ్చింది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కంగారు పడ్డారు. కానీ అప్పటికే ఎన్టీఆర్ హైద్రాబాద్ వచ్చారని తెలిసి అంతా రిలాక్స్ అయ్యారు. ఇప్పడు దేవర ప్రమోషన్స్ కోసం మళ్ళీ జపాన్ వెళ్తున్నాడని తెలిసి ఫాన్స్ అప్పటి విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS