మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఎన్టీఆర్ తొలిసారిగా నటిస్తున్నాడు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. తాజాగా ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుందట ఈ చిత్రం. ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ చాలా బాగా జరిగిందట. ఔట్ పుట్ చాలా బాగా వచ్చిందంటోంది చిత్ర యూనిట్. అయితే సినిమాకి సంబంధించి చాలా గోప్యత పాఠిస్తున్నారట. అందుకు కారణం త్రివిక్రమ్ శ్రీనివాస్‌కి 'అజ్ఞాతవాసి' రూపంలో పెద్ద డిజాస్టర్ ముందుండడమే అంటున్నారు.
అయినా కానీ త్రివిక్రమ్‌ని తక్కువగా అంచనా వేయడానికి లేదు. ఎందుకో 'అజ్ఞాతవాసి' విషయంలో అంచనాలు తారుమారయ్యాయి. కానీ ఎన్టీఆర్‌తో తొలిసారి తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో, భారీ అంచనాలతో వచ్చిన 'అజ్ఞాతవాసి' ఫెయిల్యూర్ చవి చూడడంతో ఈ సినిమాపై త్రివిక్రమ్ కొంచెం ఎక్కువగా కాన్‌సన్‌ట్రేషన్ చేశాడనీ తెలుస్తోంది. అలాగే పర్‌ఫెక్ట్ ప్రణాళికతో ఉన్నాడట. ఎక్కడా రాజీపడకుండా, ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ విషయంలోనూ త్రివిక్రమ్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట.
ముందుగా అనుకున్న సబ్జెక్ట్‌లో చిన్న చిన్న మార్పులు చేశాడట. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ కాస్త బరువు తగ్గి, స్లిమ్‌గా మారాడు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి పాత్రలో ఎన్టీఆర్ ఈ సినిమాలో నటిస్తున్నాడనీ సమాచారమ్. ఎన్టీఆర్‌కి జోడీగా అందాల భామ పూజా హెగ్దే ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఫస్ట్ షెడ్యూల్ పర్‌ఫెక్ట్‌గా రావడంతో కాస్త గ్యాప్ తీసుకుని నెక్స్ట్ షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ ప్రిపరేషన్స్ చేయనుందట. దసరాకి ఈ సినిమాని విడుదల చేసే యోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది.