త్రివిక్రమ్‌తో ఓసారి పనిచేస్తే మళ్లీ మళ్లీ పనిచేయాలనిపిస్తుందేమో. హీరోలంతా త్రివిక్రమ్‌తో ఓ సినిమా చేసి ఆపేయరు. మళ్లీ మళ్లీ చేస్తూనే ఉంటారు. పవన్‌కల్యాణ్, అల్లు అర్జున్, మహేష్‌బాబు... `రిపీట్` మోడ్ లో సినిమాలు చేసినవాళ్లే. ఇప్పుడు ఎన్టీఆర్ కూడా త్రివిక్రమ్‌తో సినిమా చేయాలని ఉవ్వీళ్లూరుతున్నాడు. ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబోలో `అరవింద సమేత వీర రాఘవ` విడుదలైంది. ఆ సినిమా ఎన్టీఆర్ అభిమానుల్ని బాగానే మెప్పించింది.
బాక్సాఫీసు దగ్గర కూడా బాగానే వసూలు చేసింది. ఇప్పుడు ఈ కాంబోలో మరో సినిమారాబోతోంది. ఎన్టీఆర్ ప్రస్తుతం `ఆర్.ఆర్.ఆర్`తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పూర్తయిన వెంటనే త్రివిక్రమ్‌తో సినిమాని పట్టాలెక్కిస్తాడట. మరోవైపు త్రివిక్రమ్ బన్నీ సినిమా పనిలో ఉన్నాడు. రాజమౌళి సినిమా 2020 మే నాటికి గానీ పూర్తవ్వదు. బన్నీ సినిమా అయిపోగానే.. త్రివిక్రమ్‌కి మరో సినిమా లాగించేసే ఛాన్సుందన్నమాట.