'వివేకం' కోల్పోయిన ఆ హీరో!

మరిన్ని వార్తలు

బాలీవుడ్‌ హీరో వివేక్‌ ఒబెరాయ్‌ పేరులో ఉన్న వివేకాన్ని కోల్పోయి ప్రవర్తించాడు. ఇంతకీ ఆ వివేకం ఏంటంటారా.? ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్ని ఐశ్వర్యారాయ్‌తో పోల్చి చూపించారాయన. అదేంటీ అదేం పోలికా.? అంటారా.? అందుకే అందరూ దాన్ని తప్పు పడుతున్నారు. ఇంతకీ ఈ విలక్షణ నటుడు పోల్చిన పోలిక ఏంటంటారా.? సార్వత్రిక ఎన్నికలను ఐశ్వర్యారాయ్‌ లవ్‌ లైఫ్‌ స్టైల్‌కి కనెక్ట్‌ చేసి చూపించారాయన. ఎలక్షన్స్‌కి ముందొచ్చే ఒపీనియన్‌ పోల్స్‌ని ఐశ్వర్యారాయ్‌ - సల్మాన్‌ ఖాన్‌ లవ్‌స్టోరీతో పోల్చారు.

 

రిజల్ట్స్‌కి ముందొచ్చే ఎగ్జిట్‌ పోల్స్‌ని వివేక్‌ ఒబెరాయ్‌ - ఐశ్యర్యారాయ్‌ లవ్‌తోనూ, ఫైనల్‌ రిజల్ట్‌ని అభిషేక్‌ బచ్చన్‌ పెళ్లితోనూ ముడి పెట్టి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఐశ్వర్యారాయ్‌ పెళ్లి చేసుకుని భర్తతో ఫ్యామిలీ లైఫ్‌ లీడ్‌ చేస్తున్న మహిళ. అలాంటి మహిళ విషయంలో వివేక్‌ ఒబెరాయ్‌ వంటి మంచి నటుడు ఇలాంటి కామెంట్స్‌ చేయడం అందరూ తప్పుపట్టారు. ప్రముఖ దర్శకుడు మాధుర్‌ బండార్కర్‌ అయితే, 'వివేక్‌ నీ నుంచి ఇలాంటి చర్యను ఊహించలేదు..' అని సోషల్‌ మీడియా ద్వారా స్పందించారు.

 

వివేక్‌ ఒబెరాయ్‌ మంచి నటుడు. విలక్షణ పాత్రలను ఎంచుకుంటూ ఉంటాడు. హిందీలోనే కాదు, ఈ మధ్య సౌత్‌పై కూడా ఆయన దృష్టి పెట్టాడు. ఇటీవల రామ్‌చరణ్‌ నటించిన 'వినయ విధేయ రామ' చిత్రంలో కరడు గట్టిన ప్రతినాయకుని పాత్రలో నటించి మెప్పించాడు. అలాంటి ఓ మంచి నటుడి నుండి ఇలాంటి స్పందనను నిజమే ఎవరూ ఊహించలేరు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS