ఎన్టీఆర్ జై లవకుశ చిత్రం విడుదలై ఇప్పటికే దాదాపు నాలుగు నెలలు దాటిపోయింది. ఈ తరుణంలో ఆయన తన తాజా చిత్రం త్రివిక్రమ్ తో చేయాల్సి ఉంది.
ఇక ఈ చిత్రానికి సంబంధించి పూజా కార్యక్రమాలు జరగిపోవడం జనవరి ఆఖరి వారం లేదా ఫిబ్రవరి మొదటివారం నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది అని అందరు భావించారు. అయితే ఫిబ్రవరి మొదటివారమే కాకుండా రెండవ వారం కూడా వచ్చేస్తుండడం అయినా ఎటువంటి సమాచారం లేకపోవడంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
అయితే ఈ చిత్రం ప్రారంభం అవ్వడానికి మరికొన్ని రోజులు సమయం పడుతుంది అని తెలుస్తున్నది. దీనితో కొంతమంది అభిమానులకి అసలు ఈ సినిమా మొదలుపెడతారా? లేదా? అన్న ప్రశ్నలు కూడా సోషల్ మీడియా వేదికగా అభిమానులు ప్రశ్నలు సంధిస్తున్నారు.
ఈ ప్రశ్నలు రావడానికి కారణం- త్రివిక్రమ్ తాజా చిత్రం అజ్ఞాతవాసి బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తాపడడం అలాగే ఈ ఫ్లాప్ కి ముఖ్య కారణం త్రివిక్రమ్ అని తేలడమే.