ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఓ సినిమా కుదిరినట్టే కుదిరి, ఆగిపోయింది. `అయిననూ పోవలె హస్తినకు` అనే టైటిల్ కూడా అనుకున్నారు. ఎన్టీఆర్ కొరటాల దగ్గరకు... త్రివిక్రమ్ మహేష్ చెంతకూ చేరిపోయారు. ఈ కాంబో ఆగిపోవడానికి రకరకాల కారణాలు చెబుతున్నారు. ఎన్టీఆర్ కి చెప్పిన కథే.. త్రివిక్రమ్ మిగిలిన హీరోలకూ వినిపించేశాడని, దానికి ఎన్టీఆర్ హర్టయ్యాడని.. రకరకాల రీజన్లు.
అయితే.. అసలు విషయం ఏమిటంటే.... ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమా ఇప్పుడు ఆగిపోయినా, భవిష్యత్తులో మాత్రం తప్పకుండా ఉంటుందట. ఇప్పుడు ఎన్టీఆర్ ఓకే చేసిన కథతోనే.. ఈ సినిమా పట్టాలెక్కుతుందని తెలుస్తోంది. ఈ కథ ఎన్టీఆర్ కోసమే అని, మరో హీరోతో ఆ కథ ని త్రివిక్రమ్ చేయాలనుకోవడం లేదని త్రివిక్రమ్ సన్నిహితులు చెబుతున్నారు. అంతే కాదు.. `ఇప్పుడు వద్దు కానీ భవిష్యత్తులో తప్పకుండా చేద్దాం` అని ఎన్టీఆర్ , త్రివిక్రమ్ లు పరస్పరం ఓ అంగీకారానికి వచ్చాకే, స్నేహపూర్వకమైన వాతావరణంలోనే సినిమాని ఆపేశారని, వాళ్ల మధ్య కండీషన్స్ అలానే ఉన్నాయని.. ఇన్ సైడ్ వర్గాలు తేల్చేశాయి. సో.. ఈ కాంబో తప్పకుండా ఉంటుంది. అదే కథతో.. ఇది మాత్రం క్లియర్.