హీరోగా వరుస పరాజయాల తర్వాత రూటు మార్చేశాడు. ఇంపార్టెంట్ రోల్స్‌కి సై అంటున్నాడు. అల్లరి నరేష్‌తో కలిసి 'సిల్లీ ఫెలోస్' సినిమాలో నటిస్తున్నాడు. ఇదో మల్టీ స్టారర్ అనే చెప్పాలి.
ఈ సినిమాలో ఇటు సునీల్‌కీ, అటు అల్లరి నరేష్‌కీ ఇద్దరికీ ఈ క్వెల్ ఇంపార్టెన్స్ ఉండేలా డైరెక్టర్ వీరి క్యారెక్టర్స్‌ని డిజైన్ చేశాడట. పోస్టర్స్‌లో కూడా ఆ ఇంపార్టెన్స్‌ని చూపిస్తున్నారు. మొత్తానికి ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న 'సిల్లీ ఫెలోస్' చిత్రంతో ఈ భీమవరం బుల్లోడు, అల్లరోడితో కలిసి అల్లరల్లరి చేయనున్నాడని పోస్టర్స్ ద్వారా తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇకపోతే తాజాగా మరో విషయం తెలిసింది. ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న 'అరవింద సమేత..' చిత్రంలో సునీల్ నటిస్తున్నాడు. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ ఆ విషయాన్ని సుస్పష్టం చేసింది. టీజర్ బ్యాక్ గ్రౌండ్‌లో ఒక షాట్‌లో ఎన్టీఆర్ వెనక సునీల్ కనిపిస్తున్నాడు. సునీల్, త్రివిక్రమ్ క్లోజ్ ఫ్రెండ్స్ అన్న సంగతి తెలిసిందే. అందుకే పరాజయాల్లో ఉన్న సునీల్‌ని ఆదుకునేందుకే తన సినిమాలో త్రివిక్రమ్ ఓ బెస్ట్ ఆఫర్ ఇచ్చాడనీ తెలుస్తోంది. సునీల్ కోసం ప్రత్యేకంగా ఓ క్యారెక్టర్‌ని డిజైన్ చేశాడట. ముందుగా అనుకున్న స్టోరీలో నిజానికి సునీల్ క్యారెక్టర్ లేదట. మధ్యలో యాడ్ చేశాడట త్రివిక్రమ్.
రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో సునీల్ కోసం త్రివిక్రమ్ ఎలాంటి క్యారెక్టర్ ఇచ్చాడో తెలియాలంటే సినిమా విడుదలయ్యే వరకూ ఆగాల్సిందే.