నూతన్ మళ్ళీ బిగ్ బాస్ కి వస్తాడా?

మరిన్ని వార్తలు

సంచలనాలకి కేర్ అఫ్ అడ్రస్ అయిన బిగ్ బాస్ లో నుండి రెండవ వారమే నిష్క్రమించిన నూతన్ నాయుడు అందరికి షాక్ ఇస్తూ మళ్ళీ ఇంటిలోకి అనూహ్యంగా ప్రవేశించాడు.

అయితే అది దురదృష్టవశాత్తూ రెండు వారాల వరకే పరిమితమైంది. మొన్ననే ఆయన భుజానికి గాయంతో బిగ్ బాస్ నుండి బయటకి వెళ్ళడం జరిగింది. ఇక ఆయన ఆరోగ్య పరిస్థితి పైన నిన్న వ్యాఖ్యాత నాని ఒక వివరణ ఇచ్చాడు.

దాని ప్రకారం ఒక రెండు రోజుల చికిత్స అనంతరం ఆయన ఆరోగ్య పరిస్థితిని సమీక్షించి ఆయనని మళ్ళీ బిగ్ బాస్ ఇంటికి పంపిస్తారా లేదా అన్నది బిగ్ బాస్ నిర్ణయం పైనే ఆధారపడి ఉంటుంది అని చెప్పాడు. దీనితో ఆయన మళ్ళీ ఇంటిలోకి వచ్చే అంశం పైన కొత్త ట్విస్ట్ వచ్చింది.

 

మరి నూతన్ నాయుడు బిగ్ బాస్ లోకి రీ-రీ-ఎంట్రీ ఇస్తాడా లేదా అనేది తేలాలి అంటే ఇంకొక రెండు రోజులు ఆగాల్సిందే..

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS