ఆర్జీవీ-నాగార్జున కలయికలో వచ్చిన ఆఫీసర్ చిత్రం ఇటు ప్రేక్షకులనే కాక అటు సినిమాని పంపిణీ చేసిన వారికి కూడా తీవ్ర నిరాశనే మిగిల్చింది అని చెప్పాలి. అయితే సదరు పంపిణీదారుడు ఇప్పుడు ఏకంగా తనకి ఆత్మహత్యే శరణం అంటూ చెబుతుండడం ఇప్పుడు సంచలనంగా మారింది.
ఆ వివరాల్లోకి వెళితే, సుబ్రహ్మణ్యం అనే ఒక ఫైనాన్షియర్ వర్మకి ఆఫీసర్ చిత్ర నిర్మాణం నిమిత్తం 1 కోటి 60 లక్షలు ఇవ్వగా అది సినిమా విడుదల సమయం దగ్గర పడుతున్నా ఆ మొత్తాన్ని వర్మ & కో తిరిగి ఇవ్వలేదు. తన డబ్బు ఇవ్వమంటే ఇప్పుడు అయితే ఇవ్వలేము కావాలంటే కోర్టుకి వెళ్ళమని కూడా చెప్పారట.
అయితే ఆ తరువాత డబ్బుకి బదులు ఆంధ్రప్రదేశ్ లోని ఒక రెండు జిల్లాల పంపిణీ హక్కులు ఇవ్వమని కోరగా, ఇంకొక రెండు కోట్లు ఎక్కువ చెల్లించి మొత్తం రాష్ట్రానికి సంబంధించి హక్కులు తీసుకొమ్మని ఒక ఆఫర్ ని సుబ్రహ్మణ్యం ముందు పెట్టారు.
తక్కువ మొత్తానికే సినిమా రైట్స్ వస్తుండడంతో మిగిలిన డబ్బు చెల్లించి విడుదల హక్కులని పొందాడు. ఇక చిత్రం విడుదలవ్వడం, డిజాస్టర్ టాక్ రావడంతో అసలు పెట్టిన పెట్టుబడి కూడా రాదు అని అర్ధమై ఇప్పుడు తనకి ఆత్మహత్య తప్ప వేరే దిక్కు లేదు అని బాధపడుతున్నాడు.