వరుస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ హీరో శర్వానంద్ తాజాగా తన కెరీర్ పరంగా ఒక ఆసక్తికర నిర్ణయం తీసుకోబోతున్నాడు అని అంటున్నాయి ఫిలిం నగర్ వర్గాలు.
ఇంతకి ఆ నిర్ణయం ఏంటి అంటే- దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఈ మధ్యనే శర్వాని కలిసి ఒక స్టొరీలైన్ చెప్పాడట. ఆ స్టొరీ లైన్ నచ్చడంతో తనకి షూటింగ్ ముందే బౌండ్ స్క్రిప్ట్ ఇస్తే సినిమా మొదలుపెట్టేద్దామని ఒక షరతు పెట్టాడట. అయితే శ్రీకాంత్ శైలి మాత్రం ఇందుకు భిన్నంగా ఉంటుంది అని తెలుస్తుంది. షూటింగ్ జరిగే సమయంలో మార్పులు చేర్పులు చేస్తూ సినిమాని తీస్తుంటాడట.
ఇప్పటికే ఒక భారీ ఫ్లాప్ తో ఉన్న శ్రీకాంత్ కి ఇది మంచి అవకాశం అని అయితే ఈ సినిమాని తన శైలి మార్చుకొని తీయాల్సి ఉంటుంది అన్న అభిప్రాయం మాత్రం అందరిలోనూ వ్యక్తమవుతున్నది.
చూద్దాం.. ఈ కలయిక కార్యరూపం దాల్చనుందో లేదో..