సమంత భలే గడుసులెండీ!

By iQlikMovies - June 11, 2019 - 09:00 AM IST

మరిన్ని వార్తలు

'ఓ బేబీ' మేనియా మామూలుగా లేదు. సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న ఈ సినిమా కొరియన్‌ మూవీ 'మిస్‌ గ్రానీ'కి రీమేక్‌గా తెరకెక్కుతోంది. ఆ పాత్రలో వేరెవరైనా నటిస్తే, ఇంత క్రేజ్‌ ఉండేది కాదేమో, సమంత నటించడంతో ఈ సినిమాకి బోలెడంత క్రేజ్‌ వచ్చేసింది. సమంతకు సోషల్‌ మీడియాలో పిచ్చ పిచ్చగా ఫాలోవర్స్‌ ఉన్న సంగతి తెలిసిందే. 'ఓ బేబీ' సినిమాని చిత్ర యూనిట్‌తో పాటు, ఫ్యాన్స్‌ కూడా హుషారుగా ప్రమోట్‌ చేసేస్తున్నారు. ఈ మేనియా చూస్తుంటే సమంత ఖాతాలో మరో హిట్‌ పొంచి ఉందనడం పక్కా అనిపిస్తోంది. కథ పరంగా అరవై ఏళ్ల బామ్మ ఫోటో స్టూడియోకి వెళ్లి టీనేజ్‌ అమ్మాయిలా మారిపోతుంది.

 

ఈ విచిత్రం ఎలా జరిగింది. ఈ వింతకు కారణమేంటీ.? అనేదే కథ. కథలో ఇంత వింత దాగుంది కాబట్టే, అందరికీ ఈ సినిమా పట్ల అంత ఆశక్తి దాగుంది. అందులోనూ సమంత ఉందంటే చాలు కథతో కూడా సంబంధం లేకుండా ఆ సినిమా హిట్‌ అయిపోయి కూర్చుంటోంది. అలాంటి విభిన్న కథాంశంతో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్నే అంటేస్తున్నాయి. ఒకవేళ ఈ సినిమా హిట్‌ అయితే, డైరెక్టర్‌ నందినీ రెడ్డి దశ కూడా తిరిగిపోయినట్లే. మొన్ననే నాగచైతన్యకు 'మజిలీ'తో హిట్‌ ఇచ్చింది. ఇప్పుడు నందినీ రెడ్డి వంతొచ్చింది.

 

తర్వాత మామగారు నాగార్జున.. 'మన్మధుడు 2'లో సమంత గెస్ట్‌ రోల్‌ పోషిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా హిట్‌ కోసం చాలా మందే కాసుకుని కూర్చున్నారనాలి. అందులో ముందు వరసలో ఉన్నది రకుల్‌ ప్రీత్‌సింగ్‌. ఈ సినిమాలో రకుల్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. కీర్తి సురేష్‌ మరో హీరోయిన్‌. రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకుడు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS