థర్డ్ వేవ్ లో కరోనా విజృంభిస్తోంది. ఎటు చూసినా కరోనా కేసులో. టాలీవుడ్ లో కూడా కరోనా హవా కనిపిస్తోంది. చాలామంది సెలబ్రెటీలు ఇప్పటికే కరోనా బారీన పడ్డారు. `ఎఫ్ 3` సెట్లో కరోనా కలలకం రేపిందని టాక్. ఈ సెట్లో.. 15 నుంచి 20 మంది కరోనా బారీన పడ్డారని, వెంటనే షూటింగులు కాన్సిల్ చేశారని సమాచారం. ఈ ఒక్క సినిమానే కాదు. చాలా సినిమాల పరిస్థితి ఇదే. అగ్ర హీరోలు షూటింగులకు రామని చెప్పేశార్ట. షూటింగులకు అడ్డా అయిన అన్నపూర్ణ, రామానాయుడు, సారధి స్టూడియోలకు తాళాలు వేసేశారని సమాచారం.
అంతే కాదు.. రామోజీ ఫిల్మ్‌సిటీలోనూ ఇదే పరిస్థితి ఉందని టాక్. మొత్తానికి... చిత్రసీమలో షూటింగుల కళ లేదిప్పుడు. అందరూ స్వచ్ఛందంగా షూటింగులు మానేశారు. ఎలాగూ సంక్రాంతి సీజన్ కదా. అందుకే సెలవలు ఇచ్చేశారు. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ లాంటి అగ్ర హీరోలు... ఈ ఒమెక్రాన్ హడావుడి తగ్గేంత వరకూ షూటింగులకు హాజరు రారు. యంగ్ హీరోలదీ అదే మాట.
ఈ సంక్రాంతికి పది సినిమాలొస్తాయని టాక్ వినిపించింది. అయితే ఇప్పుడు అందులోని కొన్ని సినిమాలు డ్రాప్ అయ్యాయి. సామాన్యుడు, 7 డేస్ - 6 నైట్స్, డిజే టిల్లు, శేఖర్ సినిమాలు ఈ సంక్రాంతికి రావడం లేదు. బంగార్రాజు, రౌడీ బోయ్స్, హీరో సినిమాల మధ్యే పోటీ ఉండబోతోంది.